సినిమా

Nandamuri Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే.. : బాలకృష్ణ

Nandamuri Balakrishna: అఖండ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో నందమూరి బాలకృష్ణ..

Nandamuri Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే.. : బాలకృష్ణ
X

Nandamuri Balakrishna: సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో నందమూరి బాలకృష్ణ.. చిత్ర యూనిట్ నగంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రానికి అఖండ విజయం అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు.. అది ఈ చిత్రంలో కనిపించి అందుకే అఖండను సక్సెస్ చేశారు అని అన్నారు.. చిన్నపిల్లలకు కూడా ఈ చిత్రం బాగా నచ్చింది. వాళ్లు నా దగ్గరకు వచ్చి అంకుల్ సినిమా సూపర్ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వాళ్లు నన్ను అంకుల్ అని పిలవడం నచ్చలేదు.

ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం కేవలం మా ఒక్కరిదే కాదు.. ఇది చలన చిత్ర పరిశ్రమ విజయం అని అన్నారు. చిత్ర బృందం సమిష్టి కృషి. సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో నిజాల్ని సినిమాలో చూపించాం.. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే.

లెజెండ్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు సింహ గురించి ఆలోచించలేదు.. అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి ఆలోచించలేదు. పనిలో దేవుడు ఉన్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం అని తెలిపారు. కాగా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ అందుకుంది.

Next Story

RELATED STORIES