సినిమా

Movie Releases This Week: సంవత్సరం చివర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే..

Movie Releases This Week: గతకొంతకాలంగా థియేటర్ల వద్ద సినిమా సందడి జోరుగా కొనసాగుతోంది.

Movie Releases This Week: సంవత్సరం చివర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే..
X

Movie Releases This Week: గతకొంతకాలంగా థియేటర్ల వద్ద సినిమా సందడి జోరుగా కొనసాగుతోంది. చాలావరకు విడుదలయిన ప్రతీ సినిమా పాజిటివ్ టాక్‌తోనే నడుస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివరకు చేరుకునే సరికి మరిన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయి. 2021 డిసెంబర్ చివరి వారంలో ఏ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయంటే..

కంటెంట్ ఉన్న కథలను మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ.. ఆ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అయినా అవ్వకపోయినా.. తన పంతా మార్చుకోని యంగ్ హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు మరోసారి ఈ యువ హీరో కొత్త కథతో మన ముందుకు వచ్చేస్తున్నాడు. అదే 'అర్జున ఫల్గుణా'. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తు్న్న ఈ చిత్రాన్ని తేజ మర్ని డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త కథలను ఎంచుకోవడంలో హీరో రానా ఎప్పుడూ ముందే ఉంటాడు. అలా తాను ఎంచుకున్న ఓ పీరియాడిక్ కథే '1945'. సత్యశివ తెరకెక్కించిన ఈ సినిమా చాలాకాలం క్రితమే విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల విడుదల కాలేకపోయింది. జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన 'జెర్సీ' సినిమాను హిందీలో కూడా అదే పేరుతో రీమేక్ చేశాడు నిర్మాత అల్లు అరవింద్. గౌతమ్ తిన్ననూరినే హిందీ వర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 31న హిందీ జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇవి మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఆశ ఎన్‌కౌంటర్', వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత హీరోగా నటిస్తున్న 'ఇందువదన', డబ్బింగ్ సినిమాలు డిటెక్టివ్ సత్యభామ, అంత:పురం, టెన్‌ కమాండ్‌మెంట్స్‌, కూడా డిసెంబర్ 31నే విడుదల కానున్నాయి.

Next Story

RELATED STORIES