సినిమా

Pushpa The Rise: హిందీలో 'పుష్ప' రికార్డ్ కలెక్షన్స్‌కు కారణాలు ఇవే..

Pushpa The Rise: కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా పుష్ప భారీ కలెక్షన్స్‌నే కొల్లగొట్టింది.

Pushpa The Rise (tv5news.in)
X

Pushpa The Rise (tv5news.in)

Pushpa The Rise: 'పుష్ప' సినిమా ఏడాది చివర్లో విడుదలయినా కూడా.. కలెక్షన్ల విషయంలో మాత్రం 2021లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా పుష్ప భారీ కలెక్షన్స్‌నే కొల్లగొట్టింది. అందుకే ఈ రికార్డ్ అందుకోవడానికి ఈ సినిమాకు మరింత సులువు అయ్యింది. హిందీలో పుష్ప సినిమా ఈ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇంతకీ పుష్ప సినిమా హిందీలో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి..

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పూర్తిస్థాయి సినిమా ఇప్పటివరకు తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ తెరకెక్కలేదు. ఒకవేళ తెరకెక్కిన పుష్పలాగా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల మాత్రం కాలేదు. ఈ ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో తప్ప మరెక్కడా లభించదు. అందుకే బాలీవుడ్ వారికి దీని గురించి పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు.

పుష్పలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్, అల్లు అర్జున్ డిఫరెంట్ స్లాంగ్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఒక్క హిందీలోనే పుష్ప.. రూ.26.80 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా హిందీ రైట్స్ రూ.10 కోట్లకు అమ్ముడుపోయాయి. కానీ కలెక్షన్లు మాత్రం అంతకు డబుల్ వచ్చాయి.

అల్లు అర్జున్‌కు హిందీలో పెద్దగా మార్కెట్ లేదు. ఇప్పటివరకు తెలుగు, మలయాళంలో మాత్రమే అల్లు అర్జున్ సినిమాలు కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయేవి. కానీ పుష్ప మాత్రం అన్నింటికి భిన్నంగా హిందీలోనే ఎక్కువగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలయిన కేజీఎఫ్ హిందీ కలెక్షన్లను కూడా దాటేసి పుష్ప తగ్గేదే లే అంటోంది.

Next Story

RELATED STORIES