Bigg Boss 5 Telugu: నాగార్జున డబుల్ ఎలిమినేషన్ గేమ్.. బిగ్ బాస్ నుండి ప్రియా ఔట్

shailaja priya (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో మరో ఎలిమినేషన్ జరిగింది. ఏడో వారం శైలజా ప్రియా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. అయితే ఈవారం ఎలిమినేషనల్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముందుగా యానీ మాస్టర్, ప్రియా.. ఇద్దరూ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు హోస్ట్ నాగార్జున. దీంతో హౌస్‌మేట్స్ అంతా ఒక్కసారిగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ తర్వాత యానీ మాస్టర్ హౌస్‌లోకి వచ్చేసింది. ప్రియా స్టేజీపైకి వచ్చేసింది.
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని హౌస్‌మేట్స్ కంగారుపడ్డారు. ప్రియా వెళ్లిపోతుందేమో అని అందరికంటే ఎక్కువగా భయపడింది పింకీ. దీంతో మానస్ ఓదారుస్తున్న పట్టించుకోకుండా ఏడ్చేసింది. తిరిగి వచ్చిన యానీ మాస్టర్‌ను చూసి మిగతా హౌస్‌మేట్స్ సంతోషించారు.
స్టేజీపైకి వచ్చిన తర్వాత కాసేపు హౌస్‌మేట్స్ అందరితో సరదాగా మాట్లాడింది ప్రియా. అన్నీ టాస్కులలో చురుగ్గానే పాల్గొన్నా.. తన కోపం, ఆవేశం వల్లే ప్రియా ఎలిమినేట్ అయ్యిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు సన్నీతో తనకు రెండుసార్లు గొడవ జరిగింది. ఆ గొడవల్లో ప్రియా మాట్లాడిన మాటలు కూడా తనపై ప్రేక్షకులకు నెగిటివ్ అభిప్రాయం కలిగేలా చేశాయి. బిగ్ బాస్ నుండి వెళ్లిపోతూ ప్రియా.. బిగ్‌బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానని చెప్తూ అందరికీ గుడ్‌బై చెప్పేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com