సినిమా

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి, శ్రీరామ్.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Bigg Boss 5 Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సిరి, షన్నూ, సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, కాజల్ మాత్రమే మిగిలారు.

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి, శ్రీరామ్.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ముగిసిపోవాల్సిన సమయం దగ్గర పడుతున్నాకొద్దీ కంటెస్టెంట్స్ మరింత దగ్గరవుతూ.. ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సిరి, షన్నూ, సన్నీ, శ్రీరామచంద్ర, మానస్, కాజల్ మాత్రమే మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్ అయిపోతే.. టాప్ 5కి ఎవరు వెళ్తారో అన్న విషయం క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ వారం రోజులు కంటెస్టెంట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు ఆడించాలని బిగ్ బాస్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.

బిగ్ బాస్ ఈవారం కంటెస్టెంట్స్‌కు ఇచ్చిన టాస్క్.. రోల్ ప్లే. ఇప్పటివరకు గడిచిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో కొన్ని మర్చిపోలేని సంఘటనలను మళ్లీ గుర్తుచేసుకునే అవకాశం బిగ్ బాస్.. హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. కానీ అందులో ఎవరి క్యారెక్టర్ వారు చేయకుండా వేరే వాళ్ల క్యారెక్టర్‌లో కనిపించాల్సి ఉంటుంది. అంతే కాక మగవారికి ఆడవాళ్లలాగా చేయాల్సిన పరిస్థితి వస్తే.. వారు గెటప్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

రోల్ ప్లే టాస్క్ వల్ల బిగ్ బాస్‌లో ఫన్నీ వాతావరణం నెలకొంది. అందరు హౌస్‌మేట్స్ ఈ టాస్క్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోల్ ప్లేలో మానస్.. ప్రియాంకలాగా, సన్నీ.. మానస్‌లాగా నవ్వుల పూలు పూయిస్తున్నారు. సన్నీలాగా కాజల్, సిరిలాగా శ్రీరామచంద్ర నటిస్తుండగా.. సిరి శ్రీరామచంద్రలాగా రోల్ ప్లే చేస్తుంది. ఈ రోల్ ప్లేలో వీరి ముగ్గురి మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారు.

Next Story

RELATED STORIES