Tiger NageswaraRao : ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్

Tiger NageswaraRao : ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్
'టైగర్ నాగేశ్వరరావు'లో భారీ అంచనాలు క్రియేట్ చేసే మరో కొత్త యాక్టర్ ఎంట్రీ

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. 'ధమాకా' సినిమా తర్వాత మళ్లీ ఫుల్ ఎనర్జిటిక్ ఫర్ఫామెన్స్ తో రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ ఈ సినిమాలో చేయబోతున్నారంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ మూవీలో నటించనున్నట్టు దర్శక, నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజపుత్ పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ లుక్ ను కూడా షేర్ చేశారు. ఈ లుక్ లో అనుపమ్ ఖేర్.. సూట్ ధరించి ఆఫీసర్ పాత్రలో హుందాగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకప్పుడు స్టువర్టుపురం అనే గ్రామంలో దొంగల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టైగర్ నాగేశ్వరరావులా ఎలా మారాడు..? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఎలా గడగడలాడించాడు..? అనే విషయాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు వంశీకృష్ణ ఈ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండడం, దానికి తోడు రవితేజ మాస్ యాక్షన్ ఉండనుండడంతో మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ఇక తాజా అనౌన్స్ మెంట్ తో ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story