Tiger Nageswara Rao : సెప్టెంబర్ 5న ఫస్ట్ సింగిల్ 'ఏక్ దమ్' విడుదల

Tiger Nageswara Rao : సెప్టెంబర్ 5న ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ విడుదల
'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ సింగిల్ పై అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. సూపర్ ఎంటర్‌టైనింగ్ అండ్ ఎనర్జిటిక్ అవతార్‌ ని పెప్పీ నంబర్ రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్‌లు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ ఓ క్రేజ్ అప్ డేట్ ను వదిలారు. 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ సింగిల్ 'ఏక్ దమ్ ఏక్ దమ్' ను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటు రవితేజ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.




ఇక తాజాగా రివీల్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ, నూపూర్ సనన్ రెట్రో అవతార్‌లలో కనిపించడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నుపుర్ తన చేతుల్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీ విద్యార్థినిగా కనిపిస్తోంది. రవితేజ ఆమెను ఆటపట్టించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్‌లను కూడా ఈ పోస్టర్ లో గమనించవచ్చు. కాగా ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

టైగర్ దండయాత్ర గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ 'ది కాశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతే కాదు 'టైగర్ నాగేశ్వరరావు' రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రంగా నిలవనుంది. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నారు.



Tags

Read MoreRead Less
Next Story