కెరీర్ పీక్స్ లో ఉండగా..కనుమరుగైన తెలుగు హీరోలు వీరే.!

కెరీర్ పీక్స్ లో ఉండగా..కనుమరుగైన తెలుగు హీరోలు వీరే.!
Tollywood:ఏ భాష‌లో సినిమా అయినా స‌రే హీరో ఎవ‌రో తెలుసుకుంటాం. కొత్త హీరో అయితే సినిమా బాగుంటే వెళ్తాం.

ఏ భాష‌లో సినిమా అయినా స‌రే హీరో ఎవ‌రో తెలుసుకుంటాం. కొత్త హీరో అయితే సినిమా బాగుంటే వెళ్తాం. ఆ సినిమా విజ‌యం సాధిస్తే.. అదే హీరో మ‌రో సినిమాతో వ‌చ్చినా చూస్తాం. ఒక‌ప్పుడు క‌థ‌కంటే హీరో వ‌ల్లే ఎక్కువ సినిమాలు ఆడేవి. ప‌లానా హీరో సినిమా అన‌గానే ఎంతో ఆస‌క్తితో ఎదురూచూస్తాం. ఏ ఇండ‌స్ట్రీలోనైనా ప్ర‌తి సంవ‌త్స‌రం కొత్త హీరోలు కామ‌న్ గా వ‌స్తుంటారు. వాళ్ళలో కొంతమంది గుర్తింపు తెచ్చుకున్నా కూడా తర్వాత ఎన్నో కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమై పోతారు. కెరీర్ పీక్స్ లో ఉండ‌గా అర్థాంత‌రంగా సినిమా ఇండ‌స్ట్రీకి దూర‌మైన హీరోలు ఎవ‌రో మ‌నం తెలుసుకుందాం.

రమేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు. బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. రమేష్ బాబు హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు. 1997లో వచ్చిన ఎన్కౌంటర్ నటుడిగా రమేష్ బాబు చివరి సినిమా. హీరోగా కాకుండా నిర్మాతగా మారాడు. హిందీ సూర్యవంశం సినిమా కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చేశారు. అర్జున్, యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు.


ఆకాష్

శ్రీనువైట్ల దర్శకత్వంలో​వచ్చిన ఆనందం సినిమాతో ఆకాశ్ టాలీవుడ్‎కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆకాశ్ పేరు టాలీవుడ్ లో మార్మోగింది. ఆనందం సినిమా తర్వాత ఆకాశ్ అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమా పిలిస్తే పలుకుతా మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టింది. దీంతో ఆకాశ్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాశ్‌ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు. తమిళ చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చాడు. 'రోజా వనం' ఆకాశ్ తొలి చిత్రం. ఆ తర్వాత తెలుగులో సుమంత్‌ హీరో వచ్చిన 'రామ్మా చిలకమ్మ'లో ద్వితీయ హీరోగా నటించాడు. ఆనందం సినిమాతో తెలుగులో హీరోగా తెరంగేట్రం చేశాడు.


దాసరి అరుణ్ కుమార్

దాసరి నారాయణరావు గారి కొడుకు అయిన అరుణ్ కుమార్ గ్రీకు వీరుడు సినిమాతో పరిచయమయ్యారు. తర్వాత చిన్నా, ఒరేయ్ తమ్ముడు సినిమాలు చేశారు. తర్వాత 2017 లో వచ్చిన ఒక్క క్షణం లో విలన్ రోల్ చేశారు. శైలజ రెడ్డి అల్లుడు లో ఒక సపోర్టింగ్ రోల్ చేశారు.


వెంకట్

అన్నయ్య సినిమా లో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లు లో నటించిన వెంకట్ మీకు గుర్తుండే ఉంటారు. వెంకట్ మొదటి సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సీతారాముల కళ్యాణం చూతము రారండి. తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. తమిళ్ హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 2014లో స్నేహమే తోడుగా అనే సినిమాలో నటించారు వెంకట్. ఆ తర్వాత ఎక్కడా కనబడలేదు. వెంకట్ ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డారు.


అబ్బాస్

ఇప్పుడు అబ్బాస్ అంటే గుర్తొచ్చేది హార్పిక్ అడ్వటైజ్మెంట్. కానీ నటుడిగా ఎన్నో మంచి సినిమాలను చేశారు అబ్బాస్. అబ్బాస్ మొదటి సినిమా ప్రేమ దేశం. ఎంట్రీ ఏ శంకర్ దర్శకత్వం లో జరిగింది. ప్రేమ దేశం ఆ టైంలో పాత్ బ్రేకింగ్ సినిమా. ఇంక ఆ సినిమా తర్వాత అబ్బాస్ కి అతని హెయిర్ స్టైల్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

తర్వాత ఎన్నో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చిత్రాల్లో నటించారు. 2014లో వచ్చిన అలా జరిగింది ఒక రోజు అబ్బాస్ చివరి తెలుగు చిత్రం. తమిళ్లో 2 సీరియల్స్ లో నటించారు. 2016లో ఒక మలయాళం సినిమా తో తన సినీ కెరీర్ కి స్వస్తి చెప్పారు అబ్బాస్. ఇప్పుడు న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.





తరుణ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టిన తరుణ్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ని సంపాదించుకున్న తరుణ్ 2014లో వేట అన్న సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ 2018 లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత మళ్లీ సినిమాల్లో కనబడలేదు తరుణ్. ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నారు అన్న రూమర్లు వినిపిస్తున్నాయి.

వేణు

1999లో స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు వేణు. మొదటి సినిమానే హిట్ కావడంతో వేణు కి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో లాంటి ఎన్నో సినిమాల్లో నటించే జనానికి ఇంకా చేరువయ్యారు.2012లో వచ్చిన దమ్ము సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు.



ఆర్యన్ రాజేష్

ఈవీవీ సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సొంతం సినిమాతో హిట్ కొట్టి గుర్తింపు సంపాదించారు. ఆడంతే అదో టైపు, ఎవడి గోల వాడిది, లీలామహల్ సెంటర్, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం సినిమాల్లో నటించారు. అనుమానస్పదం సినిమా ఎలా ఉన్నా ఇళయరాజా పాటల వల్ల అందరికీ తెలిసింది. 2012లో వచ్చిన బాలరాజు ఆడి బామ్మర్ది తెలుగులో ఆర్యన్ రాజేష్ చివరిగా హీరోగా చేసిన సినిమా. బోయపాటి సినిమాలో రామ్ చరణ్ సోదరుడిగా నటించారు.

శివాజీ

శివాజీ ఎవరో మనందరికీ తెలుసు. 1997లో మాస్టర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన శివాజీ ఎన్నో సినిమాల్లో హీరోగా సహాయ నటుడిగా మెప్పించారు. తెర మీదే కాకుండా తెర వెనకాల డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు శివాజీ. నితిన్ విజయ్ సేతుపతి యశోసాగర్ కి డబ్బింగ్ చెప్పారు. 2018లో గ్యాంగ్స్టర్ అనే వెబ్ సిరీస్ లో నటించారు శివాజీ. తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టారు.

వంశీకృష్ణ

హ్యాపీ డేస్ శంకర్ పాత్రలో నటించిన అతను మీకు గుర్తుండే ఉంటాడు. అతనే వంశీకృష్ణ. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా అవి అంతగా గుర్తింపు పొందలేదు. మహానటిలో ఒక జర్నలిస్టుగా, గద్దల కొండ గణేష్ లో ఒక యువ రాజకీయవేత్తగా సహాయ పాత్రలు పోషించారు.




రోహిత్

రోహిత్ సినిమాలంటే అప్పట్లో యువత తెగ ఇష్టపడేవారు. గుర్ల్ ఫ్రెండ్, 16టీన్స్, ఇలా అనేక సినిమాలు చేశాడు. రోహిత్ సినిమాలో పాటలకు యమా క్రేజ్ ఉండేది. సొంతం నేను సీతా మహాలక్ష్మి, జానకి వెడ్స్ శ్రీరాం, మా అన్నయ్య బంగారం, సినిమా లో నటించారు. 2010 లో మా అన్నయ్య బంగారం సినిమా లో నటించిన తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని 2013లో ఎన్ఆర్ఐ , హాఫ్ బాయిల్ సినిమాల్లో నటించారు..

రాజా

2002లో ఓ చినదానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత విజయం అప్పుడప్పుడు ఆనంద్, ఆ నలుగురు, అర్జున్ , బంగారం వెన్నెల స్టైల్ మాయాబజార్, మిస్టర్ మేధావి, ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ కావడంతో అందరికీ ఇంకా చేరువయ్యారు. 2016 లో పార్కింగ్ అని ఒక సినిమా మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

ఆదిత్య ఓం

2002 లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు సినిమాల్లో నటించారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి కూడా దర్శకత్వం వహించారు.ద డెడ్ ఎండ్ అనే ఇంగ్లీష్ సినిమా ని రాసి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి అంతర్జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆదిత్య రాసిన స్క్రిప్ట్ ఎంతో ప్రసిద్ధమైన ఆస్కార్ లైబ్రరీలో పెట్టారు.ఇప్పుడు ఆదిత్య చెరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ ఒక లైబ్రరీ కట్టించారు. ఒక ఎన్జీవో సంస్థను నడుపుతున్నారు. దానిద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.





Tags

Read MoreRead Less
Next Story