సినిమా

Kajal Aggarwal :అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం.. చాలా ఎగ్జైట్‌‌‌మెంట్‌గా ఫీల్ అవుతున్నా... !

Kajal Aggarwal : సినీ నటి కాజల్ అగర్వాల్.. తన మిత్రుడు, ప్రముఖ బిజినెస్‌‌మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే..

Kajal Aggarwal :అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం.. చాలా ఎగ్జైట్‌‌‌మెంట్‌గా ఫీల్ అవుతున్నా... !
X

Kajal Aggarwal : సినీ నటి కాజల్ అగర్వాల్.. తన మిత్రుడు, ప్రముఖ బిజినెస్‌‌మెన్ గౌతమ్ కిచ్లును వివాహమాడిన సంగతి తెలిసిందే.. తన భర్తతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది కాజల్.. తన భర్తతో కలిసున్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది. ఇదిలావుండగా కాజల్ గర్భవతి అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తపై ఇంతకాలం స్పందించకుండా మౌనంగా ఉన్న ఆమె.. మొత్తానికి స్పందించింది. నా ప్రెగ్నెన్సీ విషయంపై సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను.. దాని గురించి నేను ఎంతో ఎగ్జై్ట్‌‌మెంట్‌గా, నర్వస్ గా ఫీల్ అవుతున్నాను.. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్ కి గురిచేస్తోంది. నా సోదరి నిషా అగర్వాల్ తల్లి అయ్యాక ఆమె జీవితం ఎలా మారిపోయిందో నేను చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ చందమామ.

కాగా ప్రస్తుతం కాజల్... చిరంజీవి హీరోగా వస్తోన్న అచార్య సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story

RELATED STORIES