సినిమా

Naga Chaitanya : చైతన్యకి హీరోయిన్‌‌గా, తల్లిగా నటించిన ఒకే ఒక్క హీరోయిన్..!

Naga Chaitanya : ఆరు సంవత్సరాల క్రితం వచ్చి సూపర్ సక్సెస్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది.

Naga Chaitanya : చైతన్యకి హీరోయిన్‌‌గా, తల్లిగా నటించిన ఒకే ఒక్క హీరోయిన్..!
X

Naga Chaitanya : ఆరు సంవత్సరాల క్రితం వచ్చి సూపర్ సక్సెస్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. బంగార్రాజు టైటిల్‌‌తో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య కూడా నటించాడు.

రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా ట్రైలర్ ఒక్కసారి గమనిస్తే.. నాగచైతన్య పాత్ర(చిన్నబంగార్రాజు)ను మనవడిగా చూపించారు. అంటే ఈ సినిమాలో బంగార్రాజుకి చైతూ మనవడు అన్నట్టు.. అంటే రాము(నాగార్జున), సీత(లావణ్య త్రిపాఠి)ల కొడుకే ఈ చిన్నబంగార్రాజు అన్నమాట.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠి, నాగచైతన్య యుద్ధం శరణం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. దీనికంటే ముందు మనం సినిమాలో ఫ్రెండ్స్‌‌గా నటించారు. ఇప్పుడు తల్లికొడుకులుగా నటించనున్నారు. అయితే సినిమాలో వీరిద్దరి మధ్య సీన్స్ ఉంటాయా లేకా బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తోనే స్టొరీని నడిపిస్తారా అన్నది చూడాలి.

Next Story

RELATED STORIES