సినిమా

AP Movie Ticket Price: ఈ బలుపు మాటలు ఎవరిని మెప్పించడానికి: తమ్మారెడ్డి

AP Movie Ticket Price: ఏపీ సర్కారు తీరుపై సినిమా ఎగ్జిబిటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

AP Movie Ticket Price: ఈ బలుపు మాటలు ఎవరిని మెప్పించడానికి: తమ్మారెడ్డి
X

AP Movie Ticket Price: ఏపీలో సినిమా టికెట్ల వివాదం మరింత రాజుకుంటోంది. ఏపీ సర్కారు తీరుపై సినిమా ఎగ్జిబిటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో తీవ్రంగా నష్టపోతామన్నారు. అద్దెలు, కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇక 5 రూపాయలకు సినిమా టికెట్ అంటే తీవ్ర మనస్తాపం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

5 రూపాయలతో ఏసీలు, ఫ్యాన్లు ఎలా నడపాలని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని సినిమా మనిషే అని.. ఆయనకు మొత్తం తెలుసన్నారు. వివాదంపై సీఎంతో మాట్లాడే అంత చనువు ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. అటు ఏపీలో సినిమా గోడును పట్టించుకునే వాళ్లే లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సినీ పరిశ్రమ వివాదంపై అంతా కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ ధరలపై సినీపరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. బలిసి కొట్టుకుంటోంది నల్లపురెడ్డే అంటూ ఫైర్ అయ్యారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని.. అనవసర వ్యాఖ్యలతో నల్లపురెడ్డి కుటుంబ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని హెచ్చరించారు. దమ్ముంటే తన సినిమా షూటింగ్ కు వచ్చి యాక్టర్ల కష్టం చూడాలంటూ ప్రసన్న కుమార్ రెడ్డికి సవల్ విసిరారు ఎన్వీ ప్రసాద్.

అటు వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైరయ్యారు. సినిమా వాళ్లంటే అంత పలుచనగా కనబడుతున్నామా అని ప్రశ్నించారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినపుడు మీ ఆస్తులెంత, ఇప్పుడెంత..చర్చిద్దామా.. అంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ప్రముఖులంతా సినీ పరిశ్రమ వివాదంపై స్పందిస్తున్నారు. రోజురోజుకు తీవ్రమవుతున్న వివాదానికి ప్రభుత్వం ఎపుడు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.

Next Story

RELATED STORIES