Divorce: తెలుగు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలు వీళ్లే..!

Divorce: తెలుగు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలు వీళ్లే..!
Divorce: ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి.

Divorce: ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోయి విడాకులు తీసుకున్న జంటల గురించి తెలుసుకుందాం..

1. మంచు మనోజ్ కుమార్

మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు. ఇది నిజంగానే ఓ సంచలనం. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు. అప్పటివరకు తను తన భార్యతో విడిపోతున్నాడని కనీసం గెస్ కూడా చేయని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.



2. ప్రకాష్ కోవేలమూడి

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి 2014లో ప్రేమ వివాహం జరిగింది. సైజ్ జీరో, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన ప్రకాశ్ కూడా తన వైవాహిక జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. ఈయన కనిక దిల్లాన్‌ అనే సినీ రచయిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పలు చిత్రాలకు కలిసి పనిచేసారు. కానీ చివరికి వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే పరస్పర అంగీకారంతో విడిపోయినట్టు తెలిపారు.



3. సుమంత్

సుమంత్.. తొలిప్రేమతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎంతోకాలం నిల‌వ‌లేదు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నా రెండేళ్లు కూడా వారు క‌లిసి ఉండలేక‌పోయారు. సుమంత్‌తో విడాకులు తీసుకున్న కీర్తి మ‌రో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలతో భర్తతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిల్ అయిపోయింది. సుమంత్ మాత్రం మ‌రో పెళ్లి చేసుకోలేదు.



4. పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.



5. నాగార్జున అక్కినేని

నాగార్జున అక్కినేని 1984 లో డాక్టర్ డి రామానాయిడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నాడు, కాని అతను 1990 లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. నాగ చైతన్య అమ్మ లక్ష్మికి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్నాడు నాగార్జున.



6. ఝాన్సీ

బుల్లితెరపై పేరున్న వారిలో ఒకరైన ఝాన్సీ కూడా తన భర్తతో విడిపోయి చాలాకాలమే అయ్యింది. నటి, యాంకర్ ఝాన్సీ మొదట జోగి నాయుడిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అతనితో విడాకులు తీసుకున్న తరువాత, ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్న వ్యక్తితో సహా జీవనం చేస్తున్నట్టు సమాచారం..!



7. శరత్‌బాబు

నటుడు శరత్ బాబు మొదటిసారి నటి రమ ప్రభును 1981 లో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1988 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.



8. రాధిక శరత్ కుమార్

రాధికకు మూడుసార్లు వివాహం జరిగింది. ఆమె మొదటి వివాహం 1985 లో నటుడు-దర్శకుడు ప్రతాప్ పోథన్‌తో జరిగింది. ఆమె రెండవ వివాహం రిచర్డ్ హార్డీతో జరిగింది. ప్రస్తుతం ఆమె సహ నటుడు శరత్ కుమార్‌ను వివాహం చేసుకుంది.



9. ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ ఇంతకుముందు 1994 లో నటి లలితా కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ జంట 2009 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను 2010 లో వివాహం చేసుకున్నారు.



10. కమల్ హాసన్

1978 లో కమల్ హసన్ 24 సంవత్సరాల వయసులో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు మరియు వారు పదేళ్ల తరువాత విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్ మరియు నటి సరికా 1988 లో కలిసి జీవించడం ప్రారంభించారు. వారికి శ్రుతి హాసన్ జన్మించిన తరువాత వివాహం చేసుకున్నారు. 2002 లో ఈ జంట విడాకుల కోసం దాఖలు చేశారు.



Tags

Read MoreRead Less
Next Story