సినిమా

నటుడిగా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన దర్శకేంద్రుడు.. లుక్ అదుర్స్

K Raghavendra Rao: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు.

నటుడిగా ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిన దర్శకేంద్రుడు.. లుక్ అదుర్స్
X

K Raghavendra Rao: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగు సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. తన సినిమాల్లో హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడికి మరెవరు సాటి రారు. కమర్షియల్ మూవీస్, భక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కె. రాఘవేంద్రరావు తన 45 ఏళ్ళ కెరీర్‌లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం గెస్ట్ రోల్ కూడా వేయలేదు. తన తోటి దర్శకులు నటులుగా అతిథి పాత్రల్లో కనిపించినా.. ఆయన మాత్రం అసలు ఆసక్తి చూపించలేదు.

మెగాఫోన్ చేతపట్టి తెరవెనక మాత్రమే ఉండే ఈ మౌన ముని.. ఇప్పుడు తెరముందుకు వచ్చారు. రాఘవేంద్రరావు తొలిసారిగా సినిమాలో నటించడం సినీ అభిమానులకు ఆశ్చర్యపోయేలా చేసింది. నిన్నమొన్నటి వరకు కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కాదు. ఓ ప్రైవేట్ చానల్ లో స్పెషల్ గా ఒక షో ఏర్పాటు చేసి దాని ద్వారా తన స్టార్స్ తో కలిసి మ్యాజిక్ చేశారు.

రాఘవేంద్రరావు తన శైలికి భిన్నంగా ఇప్పుడు ఆన్ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా పెళ్లిసందD. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు ఓ సీన్ లో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో ఆయన వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నట్లు పెళ్లిసందD టీం అధికారికంగా ప్రకటించింది. రాఘవేంద్రుడికి సంబంధించిన ఓ నిమిషం నిడివిగల ప్రోమో రిలీజ్ చేసింది. ఇప్పుడది నెట్టింట్లో వైరల్ అయింది.

ఆ వీడియో విషయానికి వస్తే.. 75 ఏళ్ల రాఘవేంద్రరావుకు ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఆయన డ్రెస్ స్టైల్ సూపర్ అనేలా ఉంది. చేతిలో బాల్ పట్టుకొని అమ్మాయిలతో కలిసి బాస్కెట్ బాల్ ఆడారు. కూల్ గ్లాస్ పెట్టుకొని.. బ్లూ కలర్ జాకెట్, స్తై బ్లూ షర్ట్, ఫ్యాంట్ ధరించి అదరగొట్టారు. ఇన్నాళ్లు సినిమాలు డైరెక్ట్ చేయడమే తెలిసిన రాఘవేంద్రరావుకు నటుడిగా ఇదే తొలి అనుభవం. ఈ మెగా దర్శకుడుని డైరక్ట్ చేస్తున్నారు గౌరీ. ఆర్కే ఫిల్మ్స్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మి్స్తు్న్నాయి. పెళ్లిసందD సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు దర్శకేంద్రుడు.
Next Story

RELATED STORIES