సినిమా

Rajamouli : RRR అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి...!

Rajamouli : రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్.. అందులో భాగంగా సినిమాకి RRR అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న దానిపైన దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Rajamouli : RRR అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే... క్లారిటీ ఇచ్చిన రాజమౌళి...!
X

Rajamouli : ఇప్పుడు ఇండియా సినిమా మొత్తం ఎదురుచూస్తోన్న చిత్రం RRR.. బాహుబలి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తోన్న తదుపరి చిత్రం కావడంతో RRR పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీనికి తోడు టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం సినిమాకి మరో బిగ్ క్రేజ్.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్.. అందులో భాగంగా సినిమాకి RRR అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న దానిపైన దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమాకి మొదట్లో ఏ టైటిల్ పెట్టాలో అర్ధం కాలేదని అన్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పేర్లు కలిసోచ్చేలా ఈ ప్రాజెక్ట్ ని RRR అని పిలవాలనుకున్నామని, #RRR అనే హ్యాష్ ట్యాగ్ తోనే అప్డేట్స్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో అదే పేరును ఫిక్స్ చేసినట్టుగా రాజమౌళి వెల్లడించాడు.

కాగా ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించింది.

Next Story

RELATED STORIES