సినిమా

Tollywood: డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Tollywood: ఈడీ ఎంట్రీతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది.

Tollywood: డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
X

Tollywood: ఈడీ ఎంట్రీతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈ ఎపిసోడ్‌లో ఈడీ అభియోగాలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే ఉత్కంఠ నెలకొంది.. డ్రగ్స్‌ కేసులో గతంలో పలువురు విదేశీయులను అరెస్టు చేసిన ఎక్సైజ్‌ అధికారులు.. వారిచ్చిన వివరాల ఆధారంగా పలువురు తారల్ని గతంలో ప్రశ్నించారు. ఆ తర్వాత మనీలాండరింగ్‌ జరిగి ఉండొచ్చనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది.. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు వున్నారు. వచ్చేనెల 22లోగా విచారణ ముగించేలా ఈడీ టార్గెట్‌ పెట్టుకుంది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కేవలం రాష్ట్ర పరిధిలో వున్న ఎక్సైజ్‌ శాఖ, సిట్‌ దర్యాప్తులకే పరిమితం చేయడంతో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును ఈడీ, సెంట్రల్‌ ఎకనామిక్స్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోతో దర్యాప్తు చేయించాలని పిటిషన్లు దాఖలయ్యాయి.. అటు కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌ కమిషనర్‌కు గత ఏడాది నవంబరులోనే ఈడీ లేఖ రాసింది. కోర్టు ద్వారా ఎక్సైజ్‌ శాఖ నుంచి కేసు వివరాలో అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. కేసులో విదేశీయులుగా వున్న పౌరులు నిందితులుగా ఉండటంతో మనీ ల్యాండరింగ్‌ జరిగే అవకాశం ఉండొచ్చనే ఆరోపణలు వినిపించాయి. అక్రమ పద్ధతిలో లావాదేవీలు జరిగినట్లు పలు ఆధారాలు సేకరించిన ఈడీ.. కేసులో చిక్కుముడులను విప్పేందుకు ట్రై చేస్తోంది.

అటు ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు టాలీవుడ్‌ స్టార్లను విచారించనున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు. మొదట డైరెక్టర్ ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 22 వరకునటీనటులను తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో సెప్టెంబరు 22 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే చర్చ సర్వత్రా జరుగుతోంది.

Next Story

RELATED STORIES