సినిమా

Tollywood Producer: 'అనుకోని అతిధి' నిర్మాత కన్నుమూత

కోవిడ్ తో కొందరు, గుండెపోటుతో కొందరు, ఇతర రకాల అనారోగ్య సమస్యలతో మరికొందరు సినీ ప్రముఖులు ఎంతో మంది ఈ మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోయారు.

Tollywood Producer: అనుకోని అతిధి నిర్మాత కన్నుమూత
X

Tollywood Producer: కార్డియాక్ అరెస్ట్ కారణంగా తెలుగు చిత్ర నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నంలో కన్నుమూశారు. కృష్ణ కుమార్ ఆకస్మిక మరణం తెలుగు సినీ ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది.

అన్నంరెడ్డి కృష్ణ కుమార్ త్వరలో విడుదలవబోయే సైకలాజికల్ థ్రిల్లర్ 'అనుకోని అతిధి' కి నిర్మాతగా వ్యవహరించారు. 2019లో విడుదలైన మలయాళ చిత్రం 'అతిరాన్' గా డబ్బింగ్ వెర్షన్ గా దీన్ని తీర్చిదిద్దారు.

ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసి తెలుగులో తీసుకువచ్చారు. తెల్లవారు జామున గుండెనొప్పిగా ఉందని బాధ పడుతున్న కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు గుర్తించేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. అతని చిత్రం అనుకోని అతిధి మరో రెండు రోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. అంతకు ముందే ఆయన ఆకస్మిక మరణం తీవ్ర బాధను మిగిల్చింది.

ఫహద్ ఫాసిల్ మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన 'అనుకోని అతిధి' మే 28 నుండి OTT లో ప్రసారం కానుంది. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ సినీ-గోయర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి, సుదేవ్ నాయర్, నందు. లీనా కీలక పాత్రల్లో నటించారు.

Next Story

RELATED STORIES