సినిమా

Vijay Devarakonda : ఈ మధ్యే బ్రేకప్ అయింది.. బాధలో ఉన్నా..!

Vijay Devarakonda : ఈ మధ్య తనకి ఒక బ్రేకప్ జరిగిందని అందుకే కొంచెం బాధలో ఉన్నానని.. ఆ విషయం ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదని అన్నాడు.

Vijay Devarakonda : ఈ మధ్యే బ్రేకప్ అయింది.. బాధలో ఉన్నా..!
X

Vijay Devarakonda : ఈ మధ్య తనకి ఒక బ్రేకప్ జరిగిందని అందుకే కొంచెం బాధలో ఉన్నానని.. ఆ విషయం ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదని అన్నాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న పుష్పక విమానం చిత్రం విడుదలకి సిద్దంగా ఉంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సరదా చాట్‌లో పాల్గొన్నారు. గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్‌ చేసిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా విజయ్ అన్న ప్రశ్నకి స్పందిస్తూ.. " ఈ మధ్య నాకు ఒక హార్ట్‌బ్రేక్‌ జరిగింది. ఇప్పటివరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు.

అటు ఆనంద్ దీనిపైన స్పందిస్తూ నేను ఇంకా సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా డైరెక్టర్‌ దామోదర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి విజయ్ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేశాయి.

Next Story

RELATED STORIES