సినిమా

Puneeth Rajkumar: మంచి స్నేహితుడిని కోల్పోయిన ఎన్‌టీఆర్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. అప్పటివరకు తమతోనే సరదాగా గడిపిన మనిషి ఒక్కసారిగా తిరిగి రాని లోకాలుగా వెళ్లిపోయాడు అంటే నమ్మడం కష్టమైన విషయమే. అందుకే పునీత్ కుటుంబ సభ్యులు అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. పునీత్‌కు శాండల్‌వుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నటులు కూడా స్వయంగా వెళ్లి సంతాపం తెలియజేస్తున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్ హీరోలతో మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. కుదిరినప్పుడల్లా తెలుగు హీరోలను కలుస్తూ ఉండేవారు పునీత్. అందులోనూ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో పునీత్‌కు ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకం. అందుకే తన మరణ వార్త తెలియగానే ముందుగా కంఠిరవలోని తన పార్థివదేహాన్ని చూడడానికి బయల్దేరారు బాలకృష్ణ. ఆ వెంటనే ఎన్‌టీఆర్ కూడా అక్కడికి పయణమయ్యారు.

ఎన్‌టీఆర్.. పునీత్ రాజ్‌కుమార్ నివాసం వద్ద చాలాసేపే గడిపారు. తన అన్న శివరాజ్‌కుమార్‌ను పరామర్శించారు. తన స్నేహితుడు పునీత్ మరణాన్ని తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత హీరో రానా కూడా అక్కడికి చేరుకుని అప్పుకు నివాళులు అర్పించారు. తన కుటుంబంతో కాసేపు మాట్లాడారు.

Next Story

RELATED STORIES