Telugu Film Chamber : కొలిక్కి రాని మీటింగ్.. షూటింగ్ బంద్‌ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సి. కళ్యాణ్

Telugu Film Chamber : కొలిక్కి రాని మీటింగ్.. షూటింగ్ బంద్‌ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సి. కళ్యాణ్
Telugu Film Chamber : టాలీవుడ్ లో షూటింగ్‌లపై డైలమా కొనసాగుతోంది.

Telugu Film Chamber : టాలీవుడ్ లో షూటింగ్‌లపై డైలమా కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్‌లో స్పెషల్ కమిటీ సమావేశం నిర్వహించగా.. 33 మంది సభ్యులు హాజరయ్యారు. జులై 30న ఇంకోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. మరోవైపు షూటింగులు ఆపాలంటూ గిల్ట్ నిర్మాతల ప్రపతిపాదనపై కమిటీ సభ్యులు ఎటూ తేల్చలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై.. ఫిల్మ్ ఛాంబర్ స్పెషల్ కమిటీ కీలక భేటీ నిర్వహించింది. వాడి వేడిగా జరిగిన ఫిల్మ్ ఛాంబర్‌ సమావేశంలో 33మంది ముఖ్య సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం ఎలాంటి క్లారిటీ లేకుండానే అర్దాంతరంగా ముగిసాయి. దీంతో ఈనెల 30 మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ సమావేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్, నిర్మాతలు , ఎగ్జిబిటర్లు, ఫెడరేషన్ సభ్యులు పాల్గొనగా.. ప్రధానంగా కాస్ట్ కటింగ్, ఓటీటీ, VPF ఛార్జీలు, ఇతర సమస్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆగష్టు 1 నుండి షూటింగ్స్ బంద్ చేస్తునట్టు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. మరోవైపు ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పై ప్రొడ్యూసర్‌ గిల్ట్‌ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 31న తెలుగు ఫిలిం ఛాంబర్‌ కొత్త కార్యవర్గ సమావేశం జరగనుంది. అదే రోజు జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో..కాస్ట్‌ కటింగ్‌, ఓటీటీ, ఇతర సమస్యలపై చర్చిస్తారు. మరోవైపు ఆగస్ట్‌ 1నుంచి షూటింగ్స్‌ నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయంపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్‌ తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తునట్లు చెప్పుకొచ్చారు.

మొత్తానికి చిత్రీకరణల నిలుపదలపై స్పెషల్‌ కమిటీ సభ్యులు ఎటూ తేలలేదు. దీనిపై జూలై 31న జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో క్లారటీ వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story