ఉదయం చూసి సాయింత్రం పెళ్లి చేసుకుని.. 'తులసి' లవ్ స్టోరీ

ఉదయం చూసి సాయింత్రం పెళ్లి చేసుకుని.. తులసి లవ్ స్టోరీ

Tulasi File Photo

Tulasi lover story: లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదటి చూపులోనే ప్రేమించారు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఆ క్షణమే అనుకున్నారు.

Tulasi lover story: లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదటి చూపులోనే ప్రేమించారు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఆ క్షణమే అనుకున్నారు. సాయింత్రం గుడికి తీసుకెళ్లి ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. పెళ్లై పాతికేళ్లయింది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ కొడుకు. తులసి మీద తొలిచూపులోనే మనసు పారేసుకున్న దర్శకుడు సెల్వమణి. వారి ప్రేమ కథ అచ్చంగా సినిమా కథలానే ఉంటుంది.

ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవడం అనేది జీవితాంతం వారిని సంతోషపెట్టే ఏకైక అంశం. కానీ కొద్దిమంది ప్రేమలు మాత్రమే పెళ్లికి దారితీస్తాయి. చాలా మంది ప్రేమికులు తాము ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నామని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతారు. కానీ తులసి, సెల్వమణి ఉదయం ప్రేమించుకున్నారు, సాయింత్రం పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వెళ్లి పెద్దలకు చెప్పారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన తులసి శంకరభరణంలో మంజుల కుమార్తెగా శంకర శాస్త్రి శిష్యుడిగా ప్రేక్షకుల మనస్సుల్లో ముద్ర వేసింది. తరువాత ఆమె కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగక అక్క, వదిన, అమ్మ వంటి పాత్రలకు మారిపోయింది. ఏ పాత్ర అయినా ఆమె తన సహజ నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తులసి .. సెల్వమణితో తన ప్రేమ వివాహం గురించి సమాచారం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడ భాషా చిత్రం 'మదర్ ఇండియా'లో నటించేందుకు తులసి 1995 లో చెన్నైకి వెళ్ళినప్పుడు, అప్పటి కన్నడ దర్శకుడు సెల్వమణిని కలిశారు. సెల్వమణిని చూసినప్పుడు అతడి పట్ల ఆమెకు ప్రేమ భావన కలిగింది. అతడికి కూడా ఆమె పట్ల అలాంటి ఫీలింగే కలిగింది. దీంతో ఇద్దరు పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ రోజు సాయింత్రమే గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమది చాలా అన్యన్య దాంపత్యమని తులసి పలు సందర్భాల్లో చెబుతుంటారు.

కళ్లేమో చారెడు.. అసలే సొట్ట అంటే ఆపై బూరెడున్న బుగ్గలు.. వెరసి ఆ పిల్లాణ్ని చూడగానే అంతా భలే ఉన్నాడే అనుకున్నారు. తొలి సినిమా, కెమెరా ముందుకు వచ్చాననే లాంటి బెరుకులేవీ లేకుండా చక్కా నటించాడు కూడా. తర్వాత సీతామహాలక్ష్మితో గుర్తింపు తెచ్చుకుని శంకరాభరణం శంకరశాస్త్రి చేత శెభాష్ అనిపించుకున్నాడు.. కట్ చేస్తే కొన్నాళ్లకు కానీ తెలియలేదు.. అలా చేసింది అబ్బాయి కాదూ.. అమ్మాయని.. అబ్బాయిగా ఆకట్టుకుని, హీరోయిన్ గా రెండో హీరోయిన్ గానూ మెరిసి.. సడెన్ గా పెళ్లి చేసుకుని ఇప్పుడు హీరోలకు అమ్మయిన ఆ బుట్టబొమ్మ తులసి..

తులసి వాళ్ల అమ్మ అప్పటి స్టార్ హీరోయిన్లు అంజలీదేవి, సావిత్రిల బెస్ట్ ఫ్రెండ్. ఈ ఇద్దరూ తులసి వాళ్ల ఇంటికి తరచూ వెళ్లేవారు. అప్పుడే తులసిలోని చురుకుదనం చూసిన వారు ఆ పాపను భార్య అనే సినిమాలో బాల నటిగా రికమండ్ చేశారు. ఆ చిత్రంలో తులసి నటన నచ్చిన దాసరి నారాయణరావు ఆ పాపను ఇతర నిర్మాతలకూ రికమెండ్ చేశారు.. అలా బాలనటుడుగా మారింది తులసి.

తులసి ఒకటిన్నర యేళ్ళ వయసులోనే భార్య చిత్రంలో రాజబాబు కొడుకుగా నటిగా మారింది. 1977లో విడుదలైన చిల్లరకొట్టు చిట్టెమ్మలో చిన్నప్పటి జయచిత్రగా నటించి మంచి పేరు తెచ్చుకున్నది. అయితే సీతామహాలక్షి తర్వాతే నలుగురి దృష్టిలో పడింది. సీతామహాలక్ష్మిలో తులసి పాత్రపై మూడుపాటలు కూడా ఉండటంతో ఆమెది కూడా ప్రధానపాత్ర అయ్యింది. సీతామహాలక్షి సినిమాలో కొన్ని చిన్న నృత్య సన్నివేశాలలో తన నృత్యాన్ని తానే రూపొందించుకొని ప్రదర్శించిందట.

సీతామహాలక్ష్మితో వచ్చిన గుర్తింపుతో శంకరాభరణంలో అవకాశం వచ్చింది. కళాతపస్వి కె విశ్వనాథ్ డైరెక్షన్ లో శంకరాభరణం సినిమాతో తులసి ఓ రేంజ్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో తులసిది మూడో పాత్ర కావడం విశేషమైతే ఆ పాత్రకు తన నటనతో ప్రాణం పోసి మెప్పించడం తులసి ప్రతిభకు నిదర్శనం. జెవి సోమయాజులు, మంజు భార్గవి తర్వాత తులసి పాత్రే శంకరాభరణంకు మెయిన్ ఎస్సెట్..

శంకరాభరణం తర్వాత తులసి పేరు తెలుగునాటనే కాదు, దక్షిణాలోనే మార్మోగిపోయింది. ఈ సినిమా తర్వాత తన పేరును కూడా తులసీరామ్ గా మార్చుకుందంటే అబ్బాయిగా తులసి అభినయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్రలోకి విశ్వనాథ్ తులసి చేత పరకాయ ప్రవేశం చేయించాడా అన్నట్టుగా తులసి నటన కనిపిస్తుందీ చిత్రంలో..

నిజానికి ఆ రోజుల్లో బాల నటులకు సంబంధించి పెద్దగా ఇబ్బంది లేకపోయినా .. తులసి లాంటి అమ్మాయిల చేతా అబ్బాయి పాత్రలు చేయించారు చాలామంది. అలాగే అబ్బాయిల చేత కూడా అమ్మాయి వేషాలేయించిన వారూ ఉన్నారు. అయితే తులసికి వయసు పరంగా ఓ దశ దాటిన తర్వాత కూడా అబ్బాయిలా కనిపించి మెప్పించింది.

ఒక్కసారి ఇండస్ట్రీలో హిట్ అయితే చాలు.. ఇంక దానిపై ఎన్నో ఆశలు పెరుగుతాయి. అలాగే తులసి కూడా హీరోయిన్ కలలు బాగానే కంది. అందుకు తగ్గట్టుగానే అవకశాలు వచ్చాయి. అందుకే చాలా చిన్న వయసులోనే ఇంకా పసితనపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న టైమ్ లోనే తులసి హీరోయిన్ అయింది. జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన ముద్దమందారంలో హీరో ప్రదీప్ కు మరదలుగా నటించింది తులసి. అయితే ఇది పూర్తిగా హీరోయిన్ పాత్ర అని కూడా చెప్పలేం.. కాకపోతే హీరోయిన్ కావాలనుకుంటోన్న ఆమె ఆశలకు ముద్దమందారం తొలి వేదిక అని చెప్పొచ్చు.

అప్పటి వరకూ చిన్న పిల్లాడిగా చూసిన జనాలు తులసిని హీరోయిన్ గా చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే వచ్చిన నాలుగు స్తంభాలాట యంగ్ తులసికి మంచి గుర్తింపును తెచ్చింది. ఇందులో ఆమె పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఇంకా పసితనం ఛాయలుపోని తులసి కలలు మాత్రం ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ కావాలనే ఉండేవి.

వయసుకు మించి పరిణితి ఉండటంతో మెల్లగా తులసికి అవకాశాలు పెరిగాయి కానీ, అవేవీ ఆమె ఊహించినట్టుగా మాత్రం లేవు. రెండో హీరోయిన్ గా చిరంజీవి నటించిన శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడుతో పాటు ప్రేమించు పెళ్లాడు లాంటి సినిమాల్లో నటించింది. శుభలేఖ హిట్ కావడంతో పాటు తులసి, సుధాకర్ లకు మంచి జంటగా గుర్తింపు వచ్చింది. దీంతో వరుసగా ఈ తరహా పాత్రలే వచ్చాయి..

అయితే తులసి కోరుకున్న ఇమేజ్ ఇది కాదు.. అప్పటికే పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్ల సరసన చేరాలనేది ఆమె ఆశ. కానీ ఆ ఆశ నెరవేరడానికి ఇంకా తొలి మెట్టు దగ్గరే ఉండిపోయింది. అది కూడా చిన్న సినిమాలతో. దీంతో కావాలనుకున్న సినిమాలు, రావాలనుకున్న గుర్తింపు రాక, వస్తున్న సినిమాలు వద్దనలేక ద్వితీయ,తృతీయ ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చాలానే చేసింది..

అప్పట్లో చంద్రమోహన్ సరసన నటించిన హీరోయిన్లు టాప్ స్టార్స్ అవుతారనే సెంటిమెంట్ బలంగా ఉంది. కానీ తులసి ఎంటర్ అయ్యే టైమ్ కు చంద్రమోహన్ హీరోగా రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నాడు..అయినా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో తులసి చంద్రమోహన్ సరసన చాలా సినిమాల్లో నటించింది. అంతే కాక రోమ్ లో రోమన్ లా ఉండాలనే సామెతకు అనుగుణంగా అప్పటివరకూ కంటే కాస్త డోస్ పెంచి ఎక్స్ పోజింగ్ విషయంలోనూ కొన్ని హద్దులు దాటేసింది.

చంద్రమోహన్ సరసన నటించినా తులసికి హీరోయిన్ గా అనుకున్నంత పేరు రాలేదు. అందుకు ప్రధాన కారణం బాలనటిగా ఆమెకున్న ఇమేజే అనేది స్పష్టం. మరోవైపు ఇటు నటిగా నిలదొక్కుకునేందుకు పూజకు పనికి రాని పువ్వు లాంటి నటనావకాశం ఉన్న సినిమాతో పాటు శ్రీ కట్నలీలలు లాంటి గ్లమరస్ చిత్రంలోనూ నటించింది. కానీ ఈ రెండూ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

ఆ దశలోనే వ్యాంప్ గా నటించేందుకూ ఒప్పుకుని ఆశ్యర్యపరింది తులసి. కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించిన మహానది సినిమాలో అతన్ని బురిడీ కొట్టించే వ్యాంప్ పాత్రలో తులసి బాగా సరిపోయింది. కానీ అలాంటి పాత్రలు కూడా పెద్దగా రాలేదు.. ఇదే టైమ్ లో తను తీసుకున్న ఓ సర్ ప్రైజింగ్ డెసిషన్ తులసిని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేసింది.

తులసి పెళ్లి కుదిరింది. కానీ లాస్ట్ మినిట్ లో పారిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో ఆమె పరిచయ ఒక్క రోజుదేనట.. అయితే అతని గురించిన విషయాలేవీ ఇప్పటికీ బయటకు చెప్పేందుకు ఇష్టపడదు.. అలా హీరోయిన్ కావాలన్న కలలు కరిగిపోవడంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తులసి చాలా యేళ్ల తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ హీరో, హీరోయిన్లకు అమ్మగా నటిస్తూ కెరీర్ గాడీ లాగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story