రాఘవేంద్రరావు మూవీలో పండ్లు దెబ్బ తిన్న తొలి హీరోయిన్ ఎవరో తెలుసా.?

రాఘవేంద్రరావు మూవీలో పండ్లు దెబ్బ తిన్న తొలి  హీరోయిన్ ఎవరో  తెలుసా.?
Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు.

Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు సినిమాను అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు. సినిమాల్లో హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడికి మరెవరు సాటి రారు. టాలీవుడ్‎లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కమర్షియల్ మూవీస్, భక్తి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కె. రాఘవేంద్రరావు తన 45 ఏళ్ళ కెరీర్‌లో ఎంతో మంది హీరోహీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. రాఘవేంద్రరావు సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది పాటలు హీరోయిన్లు నాభిపై పూలు, పండ్లు.

రాఘవేంద్రరావు సినిమాల్లో పాటల్లో ఎక్కువగా పూలు, పండ్లను ఉపయోగిస్తారనేది టాక్. ద్రక్ష, దానిమ్మ, యాపిల్, బత్తాయి, నేరేడు ఇలా అన్ని పండ్లతో హీరోయిన్లపై ప్రయోగాలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకేంద్రుడు మాట్లాడుతూ.. సినిమాల్లో పండ్లను ఉపయోగించింది 50 సినిమాలు దర్శకత్వం వహించన తర్వాతే అని చెప్పారు. అయితే హీరోయిన్స్ పై పండ్లు వేయడం చిరంజీవి, విజయశాంతి(Vijayasanthi), సుహాసిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన 'మంచి దొంగ' సినిమాతోనే. 'బెడ్ లైట్ తగ్గించనా' అనే పాటలో తొలిసారి విజయశాంతిపై పండ్లు వేసారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి బాణీలు అందించారు.



Tags

Read MoreRead Less
Next Story