Tollywood Heroes Remuneration: పదేళ్లక్రితం అంత.. ఇప్పుడేమో ఇంత: ఏ హీరో రెమ్యునరేషన్ ఎంతంటే..?

Tollywood Heroes Remuneration: పదేళ్లక్రితం అంత.. ఇప్పుడేమో ఇంత: ఏ హీరో రెమ్యునరేషన్ ఎంతంటే..?
Tollywood Heroes Remuneration: హీరోలు కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు.

Tollywood Heroes Remuneration: ఒక్క సినిమా హిట్టైతే రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. అయ్యవారి ఇంటి ముందు దర్శక నిర్మాతలు క్యూ కట్టాల్సిందే. అడిగినంతా ఇవ్వాల్సిందే.. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది పారితోషికాలు పదేళ్లలో పదింతలు పెరిగాయి. హీరోలు కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం తెలుగులో స్టార్లుగా వెలుగుతున్న చాలామంది హీరోల పదేళ్ల క్రితం రెమ్యునరేషన్ ఏంటి, ఇప్పుడు రెమ్యునరేషన్ ఏంటి అని పోలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన హీరో ప్రభాస్. 'బాహుబలి' తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కాస్త.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌గా మారిపోయాడు. అయితే ప్రభాస్ పదేళ్ల క్రితం చేసిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలకు తన రెమ్యునరేషన్ రూ.5 కోట్లు ఉండేది. ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకే రూ. 100 నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని అందరికీ షాక్ ఇస్తున్నాడు.



దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకు బడ్జెట్టే వందల కోట్లలో పెట్టిన రాజమౌళి.. హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఒప్పుకున్నాడు అనే అంశం ఇప్పటికీ అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే 'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.



పది సంవత్సరాల క్రితం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ నుండి 'అదుర్స్', 'ఆరెంజ్' సినిమాలు వచ్చాయి. అయితే ఆ సమయంలో ఎన్‌టీఆర్ రెమ్యునరేషన్ రూ. 9 కోట్లు కాగా.. రామ్ చరణ్ 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు వారి పారితోషికం ఏకంగా రూ. 50 కోట్లకు పెరిగిపోయింది. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ రెమ్యునరేషన్‌పై వస్తున్న టాక్‌ను అబద్ధమని స్పందించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ పెద్దగా వార్తలు రాలేదు. పైగా తన సినిమాలకు దాదాపుగా తానే కో ప్రొడ్యూసర్‌గా ఉండడం మొదలుపెట్టాడు. పదేళ్ల క్రితం మహేశ్ నుండి ఖలేజా, దూకుడు సినిమాలు వచ్చాయి. అప్పుడు తన రెమ్యునరేషన్ కేవలం రూ. 8 కోట్లు మాత్రమే. ఇప్పుడు మహేశ్ పారితోషికం గురించి మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు.



వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే పదేళ్ల క్రితం జల్సా, కొమరం పులి సినిమా టైమ్‌లో పవన్ రూ. 7.5 నుండి 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవారని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఒక్క సినిమాకు 50 నుండి 75 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారని సమాచారం.



ఇప్పటివరకు టాలీవుడ్‌, మాలీవుడ్‌లో మాత్రమే స్టార్ హీరోగా వెలుగుతున్న అల్లు అర్జున్.. ఇటీవల విడుదలయిన 'పుష్ప' చిత్రం వల్ల పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. పదేళ్ల క్రితం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్‌కు, ఇప్పుడు తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు దాదాపు పదిశాతం తేడా ఉంది. పదేళ్ల క్రితం విడుదలయిన వరుడు, వేదం లాంటి చిత్రాల కోసం రూ.5 నుండి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అల్లు అర్జున్.. పుష్ప కోసం ఏకంగా రూ. 30 నుండి 40 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.



Tags

Read MoreRead Less
Next Story