సినిమా

Bigg Boss 5 Telugu: టాప్ 3 కంటెస్టెంట్‌కు ఆ బంపర్ ఆఫర్.. ఈసారి దక్కించుకునేది ఎవరు?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఇంకాస్త సమయమే మిగిలి ఉంది.

Bigg Boss 5 Telugu (tv5news.in)
X

Bigg Boss 5 Telugu (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ఇంకాస్త సమయమే మిగిలి ఉంది. వారి ఫేవరెట్ కంటెస్టెంటే గెలవాలి అని చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఓటింగ్ విషయంలో కూడా కంటెస్టెంట్స్ అందరూ పోటాపోటీగా ముందుకెళ్తున్నారు. అయితే బిగ్ బాస్ ఫైనల్ జరగబోయే ముందు చాలామంది అభిమానులకు ఒక సందేహం మొదలయ్యింది.

బిగ్ బాస్ ఫైనల్ ప్రారంభమయిన తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్‌ను ఒక్కొక్కరిగా బయటికి తీసుకువస్తాడు హోస్ట్ నాగార్జున. కానీ అక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంది. టాప్ 5లో టాప్ 3 కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పుడు బిగ్ బాస్ వారికి ఓ ఆఫర్ ఇస్తాడు. ఎవరైతే విన్నర్ అవ్వమని అనుకుంటున్నారో వారు రూ.25 లక్షల తీసుకొని వెళ్లిపోయే సౌకర్యాన్ని అందిస్తాడు.

ఒకవేళ బిగ్ బాస్‌కు విన్నర్ అయితే వారికి వచ్చే ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. అయితే దాంట్లో సగం అంటే రూ.25 లక్షలు తీసుకుని షో నుండి తప్పుకునే ఛాన్స్‌ను టాప్ 3లో ఒకరికి ఇస్తాడు బిగ్ బాస్. ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో అదే జరిగింది. అయితే మొదటి మూడు సీజన్లలో ఈ డబ్బును ఎవరూ తీసుకోకపోయినా.. బిగ్ బాస్ 4లో మాత్రం సోహెల్ రూ.25 లక్షలను సొంతం చేసుకున్నాడు.

ఈసారి బిగ్ బాస్ 5 తెలుగుకు విన్నర్ సన్నీ అని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో షన్నూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మూడో స్థానంలో ఎవరు ఉంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావట్లేదు. మానస్, శ్రీరామచంద్ర.. ఈ ఇద్దరి ఫ్యాన్ బేస్ ఒకేలాగా ఉంది. అంతే కాకుండా వీరిద్దరికి ఓట్లు కూడా దాదాపు సమానంగానే వస్తున్నాయి. మరి వీరిద్దరిలో టాప్ 3 వరకు ఉండి రూ.25 లక్షల ఆఫర్ అందుకునేది ఎవరో తెలియాలంటే ఫైనల్ ఎపిసోడ్‌‌లోనే సాధ్యం.

Next Story

RELATED STORIES