Uday Shankar: మహా శివరాత్రి సందర్భంగా ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

Uday Shankar: మహా శివరాత్రి సందర్భంగా ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల..
Uday Shankar: కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో హీరోగా సరికొత్త ప్రయాణం చేస్తున్నాడు ఉదయ్ శంకర్.

Uday Shankar: కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో హీరోగా సరికొత్త ప్రయాణం చేస్తున్న ఉదయ్ శంకర్ కొత్త సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ చూస్తే ఉదయ్ శంకర్ లుక్స్ లో బాగా చేంజ్ కనిపిస్తుంది. యూత్ ని ఆకట్టుకునే లుక్స్ లోకి ఉదయ్ చేంజ్ అయ్యాడు.

ఒక ఫన్ మూడ్ కనిపిస్తుంది. మధునందన్ , హీరోయిన్ జన్నీఫర్ లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ లో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతుంది.

ఇది మా కథ వంటి ఒక యునిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న దర్శకుడు గురు పవన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో ప్రారంభం శర వేగంగా సాగుతుంది. అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో రూపొందుతున్నాయి. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నటీ నటులు:

ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు

సాంకేతక వర్గం:

డి.ఓ.పి. : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ మున్ద్రు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : ముజీబ్ షేక్, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా.

Tags

Read MoreRead Less
Next Story