సినిమా

Unstoppable With NBK: డ్రగ్స్ కేసుపై 'అన్‌స్టాపబుల్' షోలో క్లారిటీ ఇచ్చిన రవితేజ..

Unstoppable With NBK: బాలకృష్ణ హోస్ట్‌గా ప్రారంభమయిన అన్‌స్టాపబుల్ షో.. నిజంగానే అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది.

Unstoppable With NBK: డ్రగ్స్ కేసుపై అన్‌స్టాపబుల్ షోలో క్లారిటీ ఇచ్చిన రవితేజ..
X

Unstoppable With NBK: బాలకృష్ణ హోస్ట్‌గా ప్రారంభమయిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో.. నిజంగానే అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా వారితో కలిసిపోయి అల్లరి చేస్తూ.. బాలకృష్ణ హోస్ట్‌గా అందరి మనసులను దోచేస్తున్నాడు. చూస్తుండగానే ఏడో ఎపిసోడ్ కూడా టెలికాస్ట్‌కు సిద్ధమయ్యింది. ఈసారి మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

రవితేజ.. తనకు రెండు బ్లా్క్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఇద్దరు ఎనర్జిటిక్ స్టార్లను ఒకే వేదికపై చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఈ ఎపిసోడ్ ఫుల్ ఫీస్ట్ కానుంది. ఇక త్వరలోనే గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా కూడా ఉండడంతో దాన్ని కూడా బ్లాక్ బస్టర్ చేయాలని స్టేజ్‌పైనే స్పష్టం చేశారు.

అన్‌స్టాపబుల్ షోలో ఎన్నో పర్సనల్‌తో పాటు ఎన్నో ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకున్నారు. తన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకుని నవ్వుల పూలు పూయించారు. అయితే ఎప్పుడూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే రవితేజ.. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడమేంటి అని బాలకృష్ణ అడిగారు. దానికి రవితేజ.. తనను జీవితంలో ఎక్కువ బాధపెట్టిన విషయం అదేనంటూ చెప్పుకొచ్చాడు. అన్‌స్టాపబుల్ ఏడో ఎపిసోడ్ డిసెంబర్ 31న ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Next Story

RELATED STORIES