Upasana Konidela: 'ప్రేమలో పడడం ఈజీనే కానీ..' వైవాహిక జీవితం గురించి సీక్రెట్‌ బయటపెట్టిన ఉపాసన..

Upasana Konidela: ప్రేమలో పడడం ఈజీనే కానీ.. వైవాహిక జీవితం గురించి సీక్రెట్‌ బయటపెట్టిన ఉపాసన..
Upasana Konidela: ఇప్పటికే రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయ్యి 10 ఏళ్లు పూర్తయ్యింది.

Upasana Konidela: ఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే.. ప్రేమికుల దినోత్సవం అని ఈతరం పెట్టుకున్న పేరు. మిగతా రోజులు మనం ప్రేమించిన వారిని ఎంత ప్రేమించినా.. వారిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజే కరెక్ట్ అనుకుంటారు కొంతమంది ప్రేమికులు. మామూలువారు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీల అభిప్రాయం కూడా ఇదే. అందుకే ఈరోజు సెలబ్రిటీల సోషల్ మీడియా అంతా వారు ప్రేమించే వారికి సందేశాలతో నిండిపోయింది. మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా తన భర్త రామ్ చరణ్ కోసం ఇలాంటి ఓ స్వీట్ మెసేజ్‌ను సిద్ధం చేసింది.


మెగా ఇంట్లో అందరికంటే ముందుగా పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్. అప్పట్లో రామ్ చరణ్ భార్య ఎవ్వరికీ తెలీదు. కానీ మెల్లగా ఉపాసన సోషల్ సర్వీసుల వల్ల అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే వీరి పెళ్లి అయ్యి 10 ఏళ్లు పూర్తయ్యింది. ఇది వారు కలిసి జరుపుకుంటున్న 10వ వాలెంటైన్స్ డే. ఈ సందర్భంగా తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఎలా ఉంటున్నారన్న సీక్రెట్‌ను బయటపెట్టారు ఉపాసన.

'ప్రేమలో పడడం ఈజీ. కానీ అందులో జీవించడం మాత్రం పార్క్‌లో నడిచినంత ఈజీ కాకపోవచ్చు. జీవితాంతం మేము సంతోషంగా ఉండడానికి ఇదే మా లిటిల్ సీక్రెట్.' అని ఉపాసన ఓ వీడియోను తమ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'నేను, చరణ్‌ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వాలంటైన్స్‌ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా మారేందుకు ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.' అంటూ పలు టిప్స్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

'వివాహ బంధంలో ఆరోగ్యానికి ప్రథమ స్థానం ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. ప్రియమైన వారితో కొద్ది సమయాన్ని గడపటం రొటీన్‌గా మార్చుకోవాలి. ఏ కాస్త ఖాళీ దొరికినా డిన్నర్‌ డేట్‌, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. ఇలా చేయడం వల్ల మీ జీవితం మరింత అందంగా మారుతుంది.'

'ఒకవేళ మీరు కనుక ఇది ఫాలో కాకపోతే ఇప్పటికైనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం తెలుసుకోండి. ప్రతిఒక్కరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ, అది నిజం కాదు. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై అమితమైన ప్రేమ, గౌరవం చూపించాలి' అని ఉపాసన ఈ వీడియోలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story