సినిమా

upasana konidela : ట్రాన్స్‌జెండర్లపై ఉపాసన ఎమోషనల్ కామెంట్స్..!

upasana konidela : మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ తేజ్ సతిమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే.

upasana konidela : ట్రాన్స్‌జెండర్లపై ఉపాసన ఎమోషనల్ కామెంట్స్..!
X

upasana konidela : మెగా పవర్ స్టార్ రామ్‌‌చరణ్ తేజ్ సతిమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటుగా సొసైటీకి ఉపయోగపడే ఎన్నో విషయాలను ఆమె అందులో పంచుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో తన ట్రాన్స్‌‌జెండర్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

ఇందులో ట్రాన్స్‌‌జెండర్ కమ్యూనిటీ గురించి ఎంతో గొప్పగా చెప్పేసింది ఉపాసన. వారంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని పేర్కొంది. చూస్తుంటే ఇది తన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలో భాగంగా జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తన ఇంటికి ట్రాన్స్‌‌జెండర్లను ఉపాసన ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. అనుష్ పాల పెళ్లి వేడుకలను ప్రారంభించినందుకు ట్రాన్స్ జెండర్ అయిన తన ఫ్రెండ్ లక్ష్మీ నారాయణ్‌కు ఉపాసన థ్యాంక్స్ చెప్పింది.

"జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బతకాలో నేర్పించావ్.. హైద్రాబాద్ ట్రాన్స్ జెండర్ ఎథ్నిక్ కమ్యూనిటీ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది.. హైద్రాబాద్‌లోని ఆరు బదాయి ఇంట్లను రిప్రజెంట్ చేయడం ఆనందంగా ఉంది.. అందులో ప్రతీ ఒక్కరి వెనుక అద్భుతమైన కథ ఉంటుంది. ఆ కమ్యూనిటీ వారితో ఇంత సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది" అంటూ పేర్కొంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Next Story

RELATED STORIES