సినిమా

Rana Daggubati: రానా బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు వరుస అప్డేట్స్..

Rana Daggubati: రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుండి స్పెషల్ టీజర్ రిలీజ్ అయ్యింది.

Rana Daggubati (tv5news.in)
X

Rana Daggubati (tv5news.in)

Rana Daggubati: దగ్గుబాటి రానా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలు మాత్రమే కాదు.. త్వరలోనే ఓటీటీలో కూడా అడుగుపెట్టనున్నాడు. నటుడిగానే కాదు రానా.. నిర్మాత కూడా ప్రేక్షకుల ముందుకు మంచి కంటెంట్‌తో రానున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో 'బాహుబలి'లాంటి సినిమాలో విలన్‌గా చేయడానికి ఒప్పుకున్న రానా.. మరోసారి నెగిటివ్ రోల్‌లో కనిపించనున్న సినిమా 'భీమ్లా నాయక్'. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి స్పెషల్ టీజర్ రిలీజ్ అయ్యింది.

దగ్గుబాటి హీరోలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా కొంచెం కూడా నెగిటివిటీ లేకుండా అందరినీ అలరిస్తున్న హీరో వెంకటేశ్. ఇక వెంకటేశ్ తర్వాత అదే ఫ్యామిలీ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా పేరు సంపాదించుకున్నాడు రానా. వెంకటేశ్ లాగానే రానాకు కూడా ప్రేక్షకుల్లో నెగిటివిటీ తక్కువ.

రానా హీరోగా నిరూపించుకోవడం కంటే ముందు ఒక నటుడిగా నిరూపించుకోవాలనుకునే తన దారిలో వస్తున్న ప్రతీ పాత్రను ఎంచుకుంటూ వెళ్తున్నాడు. అందుకే భీమ్లా నాయక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యా్‌ణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రానా.. డ్యానియల్ శేఖర్ పాత్రలో మన ముందుకు రానున్నాడు.

భీమ్లా నాయక్‌తో పాటు రానా నటిస్తున్న మరొక చిత్రం 'విరాటపర్వం'. చాలాకాలం క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. వాటికి కాదంటూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా నుండి టీజర్ విడుదలయ్యి కూడా చాలాకాలమే అయ్యింది. రానా పుట్టినరోజు సందర్భంగా 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో విరాటపర్వం నుండి మరో భావోద్వేగమైన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Next Story

RELATED STORIES