సినిమా

Vadde Naveen : అభిమానులకి వడ్డే నవీన్ గుడ్ న్యూస్...!

Vadde Naveen : వడ్డే నవీన్... పెద్దగా పరిచయం అక్కర్లేదు... 1990 దశకంలో సూపర్ హీరోలలో ఈయన ఒకరు..

vadde naveen (tv5news.in)
X

vadde naveen (tv5news.in)

Vadde Naveen : వడ్డే నవీన్... పెద్దగా పరిచయం అక్కర్లేదు... 1990 దశకంలో సూపర్ హీరోలలో ఈయన ఒకరు.. లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ లలో నటించి తనకంటూ ఓ ఇమేజ్ ని సొంతంచేసుకున్నాడు. ఆయన త్రండ్రి వడ్డే రమేష్ నిర్మాత కావడంతో నవీన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఈజీగానే అయింది.. ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

మొదటి సినిమాతోనే మంచి నటుడని అనిపించుకున్న నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, మా బాలాజీ, బాగున్నారా, నా ఊపిరి ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించాడు. అయితే చూస్తుండగానే నవీన్ తెరపైన కనుమరుగయ్యారు. 2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో హీరోగా వడ్డే నవీన్ ఫేడ్ అవుట్ అయిపోయాడు.

ఆయన చివరగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమలో కనిపించారు. ఆ తర్వాత కనీసం బయట ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలీతో సరదాగా లాంటి షోకి ఆయనని పిలవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిలావుండగా తాజాగా జరిగిన మా ఎన్నికల పోలింగ్ కి వచ్చిన వడ్డే నవీన్.. మంచి కథలు, మంచి పాత్రలు వస్తే సినిమాలు చేసేందుకు సిద్దమని వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూలు ఇచ్చేంత అవసరం రాలేదని, త్వరలోనే అవి కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. నవీన్ తాజా స్టేట్మెంట్ తో అభిమానులు ఖుషి అవుతున్నారు.

Next Story

RELATED STORIES