సినిమా

Valimai Postponed: సంక్రాంతి బరిలో ఉన్న ఒకేఒక్క పాన్ ఇండియా సినిమా వాయిదా..

Valimai Postponed: సంక్రాంతి రేసు నుండి ఒక్కొక్కటిగా పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడం ఇప్పటికే ప్రేక్షకులను నిరాశపరిచింది

Valimai Postponed: సంక్రాంతి బరిలో ఉన్న ఒకేఒక్క పాన్ ఇండియా సినిమా వాయిదా..
X

Valimai Postponed: సంక్రాంతి రేసు నుండి ఒక్కొక్కటిగా పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడం ఇప్పటికే ప్రేక్షకులను, మూవీ లవర్స్‌ను విపరీతంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా సినిమాలు తప్పుకోవడంతో ఒక్కొక్కటిగా ఎన్నో చిన్న సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వాటన్నింటి మధ్యలో రెండే సినిమాలు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు అందులో మరో చిత్రం కూడా విడుదలను వాయిదా వేసుకుంటున్నట్టుగా ప్రకటించింది.

హెచ్ వినోథ్, అజిత్‌ది కోలీవుడ్‌లో ఓ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. అది సూపర్ హిట్ కావడంతో వీరి తరువాతి సినిమా గురించి అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఫైనల్‌గా వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రం 'వాలిమై' పోస్టర్స్ దగ్గర నుండి ట్రైలర్ వరకు అన్నింటింతో అజిత్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.

తెలుగు హీరో కార్తికేయ.. వాలిమైలో నెగిటివ్ రోల్ చేస్తుండడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు చాలానే ఉన్నాయి. ఎన్ని సినిమాలు తప్పుకున్నా వాలిమై మాత్రం సంక్రాంతికే వస్తుందనుకున్న ప్రేక్షకుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. తాజాగా వాలిమై కూడా వాయిదా పడినట్టు మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.


Next Story

RELATED STORIES