సినిమా

Varudu Kaavalenu: రీతూకు వరుడిగా ముందు ఆ హీరో.. కట్ చేస్తే సీన్‌లోకి శౌర్య..

Varudu Kaavalenu: టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.

Varudu Kaavalenu (tv5news.in)
X

Varudu Kaavalenu (tv5news.in)

Varudu Kaavalenu: టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా రిఫ్రెషింగ్ స్టోరీల వైపే వీరందరి చూపు ఉంది. ఒక సినిమాలో ఒక హీరో నటనను ఇష్టపడ్డామంటే మరో హీరోను తన ప్లేస్‌లో ఊహించుకోలేము. కానీ ఆ కథ ఆ హీరో దగ్గరకి వచ్చే ముందు మిగతా హీరోల దగ్గరకు కూడా చుట్టేసి వస్తుంది. తాజాగా ఒక అప్‌కమింగ్ సినిమాలో ముందుగా వేరే హీరోను అనుకొని తర్వాత నాగశౌర్యకు ఫిక్స్ అయ్యారట.

'వరుడు కావలెను'.. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు సినిమాల్లో అందరి దృష్టిని బాగా ఆకర్షించిన చిత్రమిది. ఇందులో నాగశౌర్య, రీతూ వర్మ జంట హైలైట్‌గా కనిపిస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే సినిమాలు తెరకెక్కించే నాగశౌర్య.. మరోసారి ఈ ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుగా రానున్నాడు. కానీ ఇందులో నాగశౌర్య కంటే ముందు వేరే హీరోను అనుకున్నారట.

లవ్ స్టోరీ హిట్‌తో మంచి ఫార్మ్‌లో ఉన్నాడు నాగచైతన్య. అయితే వరుడు కావలెను కథ శౌర్యకంటే ముందు నాగచైతన్య దగ్గరకు వెళ్లిందట. కానీ అప్పటికే నాగచైతన్య కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడంతో సీన్‌లోకి శౌర్య ఎంటర్ అయ్యాడు. ఈ సినిమాలో శౌర్య, రీతూ వర్మ కెమిస్ట్రీపై అప్పుడూ ఆడియన్స్ అంచనాలు కూడా పెంచేసుకున్నారు.

Next Story

RELATED STORIES