సినిమా

Venkatesh about Chaysam: చైసామ్‌పై వెంకీ మామ స్పందన.. గంటలోనే పోస్ట్ డిలీట్

Venkatesh about Chaysam: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహరం బయట ప్రేక్షకులకు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులకూ ఆశ్చర్యమే.

Venkatesh about Chaysam: చైసామ్‌పై వెంకీ మామ స్పందన.. గంటలోనే పోస్ట్ డిలీట్
X

Venkatesh about Chaysam: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహరం బయట ప్రేక్షకులకు మాత్రమే కాదు.. కొందరు సినీ ప్రముఖులకు కూడా ఆశ్చర్యాన్నే కలిగించింది. దానికి కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. చాలావరకు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరికొందరు ఈ విడాకులపై సెటైర్‌లు కూడా వేసారు. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్ కూడా దీని గురించి ఉద్దేశిస్తూ ఒక స్టోరీని పెట్టారు.

వెంకటేశ్‌కు నాగచైతన్య అంటే ఎంత ఇష్టమో ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడిస్తూనే వచ్చాడు. చైతూతో కలిసి మల్టీ స్టారర్ చేయాలన్నా, తన సినిమాలకు ప్రమోషన్ చేయాలన్నా వెంకీ ఎప్పుడూ ముందే ఉంటాడు. అలాంటి చైతూ, సమంత విడిపోయిన విషయంపై వెంకటేశ్ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాజాగా ఆయన పెట్టిన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీ చూస్తుంటే అది వారిని ఉద్దేశించి పెట్టినట్టుగానే అనిపిస్తోంది.


మనం నోరు విప్పే ముందు మనసు విప్పి ఆలోచించాలి అని ఆ స్టోరీ అర్థం. కానీ ఎందుకో ఆ స్టోరీ పెట్టిన కాసేపట్లోనే దానిని డిలీట్ చేసి మరో స్టోరీ పెట్టాడు వెంకీ మామ. దాని ప్లేస్‌లోనే ఇప్పుడు మరో స్టోరీ వెంకీ ప్రొఫైల్‌లో దర్శనమిస్తోంది. మనసులో ఒకేసారి ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ వాటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది చాలా ముఖ్యం అని ఈ స్టోరీ సారాంశం.Next Story

RELATED STORIES