Venkatesh: 27 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ మామ.. ఆ హీరోలతో కలిసి మల్టీస్టారర్..

Venkatesh (tv5news.in)

Venkatesh (tv5news.in)

Venkatesh: వెంకీ మామ హిందీలో చివరిగా నటించిన చిత్రం విడుదలయ్యి 27 ఏళ్లు అయ్యింది.

Venkatesh: ప్రస్తుతం హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలవైపు అడుగులేస్తున్నారు. అలా చేస్తూ వారి మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఒకప్పుడు ఒక తెలుగు సినిమా ఎక్కువశాతం తెలుగుతో పాటు తమిళంలో మాత్రమే విడుదల అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు.. చాలావరకు హీరోలు హిందీ మార్కెట్‌పై కూడా కన్నేశారు. సీనియర్ హీరో వెంకటేశ్ అయితే ఏకంగా నేరుగా హిందీ సినిమాలో నటించడానికే సిద్ధమవుతున్నారు.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు ఒకప్పుడు తెలుగుతో పాటు అప్పుడుప్పుడు హిందీ సినిమాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన 'చంటి' చిత్రాన్ని 'అనారి' అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు వెంకటేశ్.

అనారి తరువాత అలీ హీరోగా వచ్చిన 'యమలీల' చిత్రాన్ని 'తక్‌దీర్‌వాలా' పేరుతో బాలీవుడ్‌కు తీసుకెళ్లారు. ఈ రెండు సినిమాలు వెంకటేశ్‌ను బాలీవుడ్ వారికి దగ్గర చేశాయి. అయితే ఆయన హిందీలో చివరిగా నటించిన చిత్రం విడుదలయ్యి 27 ఏళ్లు అయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి హిందీలో నేరుగా మూవీ చేయడానికి వెంకటేశ్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం వెంకటేశ్ 'ఎఫ్ 3' సినిమాతో పాటు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'రానా నాయుడు'తో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఫర్హాద్‌ సామ్‌జీ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ కామెడీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేస్తున్నారట వెంకీ మామ. ఇందులో ఆయన ఖండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా 'ఎఫ్ 2' సినిమా బాలీవుడ్ రీమేక్‌లో వెంకటేశ్.. అర్జున్ కపూర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story