సినిమా

Venky Kudumula : గురూజీ ప్లేస్ కొట్టేసిన శిష్యుడు

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో మాంచి జోష్ మీదున్నాడు.. ఆచార్య సినిమా షూటింగ్‌‌‌ని ఫినిష్ చేసిన చిరు.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళారు.

Venky Kudumula : గురూజీ ప్లేస్ కొట్టేసిన శిష్యుడు
X

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో మాంచి జోష్ మీదున్నాడు.. ఆచార్య సినిమా షూటింగ్‌‌‌ని ఫినిష్ చేసిన చిరు.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళారు. అందులో మలయాళం రీమేక్ లూసిఫర్, తమిళ్ రీమేక్ వేదాళం, బాబీ డైరెక్షన్‌‌‌లో మరో సినిమాని చేస్తున్నాడు చిరు.. తాజాగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమాని చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు చిరు.

చిరంజీవి 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్‌‌‌‌గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇదిలావుండగా దానయ్య, చిరంజీవి కాంబినేషన్‌‌లో సినిమా వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అనౌన్స్ అయింది. అయితే అప్పుడనుకున్న దర్శకుడు త్రివిక్రమ్.. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే ప్రకటించారు.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ప్లేస్ లోకి వెంకీ కుడుముల వచ్చాడు. ఛలో, భీష్మ వంటి హిట్‌ చిత్రాలతో వెంకీ కుడుముల డైరెక్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏకంగా మూడో సినిమానే చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. వెంకీ కుడుముల త్రివిక్రమ్ శిష్యుడే కావడం.. త్రివిక్రమ్ చాలా సినిమాలకి వెంకీ అసిస్టెంట్‌‌‌గా పనిచేశాడు.

Next Story

RELATED STORIES