Vidya Balan: హాట్ ఫోటోషూట్స్ లేవా అని అడిగిన నెటిజన్.. హీరోయిన్ రిప్లై అదుర్స్..!

Vidya Balan (tv5news.in)

Vidya Balan (tv5news.in)

Vidya Balan: ఒకప్పుడు మిగతా హీరోయిన్లలాగానే హాట్ ఫోటోషూట్స్‌లో పాల్గొనేది విద్యా.. కానీ గత కొంతకాలంగా..

Vidya Balan: ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా.. గుర్తింపు రావాలంటే ఒక్క సినిమా చాలు.. ఇంకా వారి కెరీర్‌లో ఎన్ని చిత్రాలు చేసినా.. వారికి గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులు వారిని గుర్తుపెట్టుకుంటారు, అభిమానిస్తారు. అలా బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యా బాలన్‌కు పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'డర్టీ పిక్చర్'. ఈ సినిమా తరువాత విద్యాను ప్రేక్షకులు చూసే దృష్టి కూడా చాలావరకు మారిపోయింది.

అప్పటివరకు ఎన్ని ప్రేమకథల్లో నటించినా.. ఎన్ని యూత్‌ఫుల్ సినిమాలు చేసినా.. రాని గుర్తింపు విద్యాబాలన్‌కు 'డర్టీ పిక్చర్'తో వచ్చింది. అప్పటినుండి కొన్నాళ్లపాటు విద్యాబాలన్ హవా మామూలుగా లేదు. ప్రస్తుతం తాను కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనే నటిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది విద్యా.

ఒకప్పుడు మిగతా హీరోయిన్లలాగానే హాట్ ఫోటోషూట్స్‌లో పాల్గొనేది విద్యా.. కానీ గత కొంతకాలంగా కేవలం కంటెంట్ ఉన్న సినిమాలపైనే దృష్టిపెడుతూ ముందుకెళ్తోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ తనను హాట్ ఫోటోషూట్స్ లేవా అని అడగగా.. 'ఇప్పుడు వేడిగానే ఉంది. అందులోనే నేను షూట్ చేస్తున్నాను. హాట్ ఫోటోషూట్ అయిపోయిందిగా..' అంటూ విద్యా ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక త్వరలోనే 'జల్సా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది విద్యా బాలన్.



Tags

Read MoreRead Less
Next Story