సినిమా

Vijay Devarakonda : అంతా మాస్.. పుష్ప పై అర్జున్ రెడ్డి..!

Vijay Devarakonda : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు మాములుగా ఉండవు..

Vijay Devarakonda : అంతా మాస్.. పుష్ప పై అర్జున్ రెడ్డి..!
X

Vijay Devarakonda : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో మూవీ అంటే అంచనాలు మాములుగా ఉండవు.. ఆ అంచనాలకి పాన్ ఇండియా మూవీ తోడైతే ఇంకెలా ఉంటుంది. ఎక్కడ కూడా తగ్గేదే.. లే. పాన్ ఇండియా మూవీగా వీరి కాంబినేషన్ లో ఇప్పుడు 'పుష్ప' వస్తోంది. డిసెంబర్ 17న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రమోషన్లను స్టార్ట్ చేశారు మేకర్స్.. తాజాగా ఈ సినిమా పైన రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించి సినిమాకి మరింత క్రేజ్ తెచ్చాడు.

"ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను.. ట్రైలర్, సాంగ్స్, విజువల్స్, పెర్ఫార్మన్స్ .. అంతా మాస్.. నెక్స్ట్ లెవెల్ తెలుగు సినిమా.. అల్లు అర్జున్ అన్న, రష్మిక సుకుమార్ సార్ కి అల్ ది బెస్ట్.. " అని ట్వీట్ చేశాడు. విజయ్ చేసిన ట్వీట్ పైన బన్నీ స్పందించాడు.. థాంక్ యూ మై లవ్లీ బ్రదర్.. సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.. ఫ్రైడే .. తగ్గేదే.. లే" అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Next Story

RELATED STORIES