సినిమా

Vijayashanti: మహేశ్ బాబును గారు అనడం ఎందుకు అన్న నెటిజన్.. విజయశాంతి దీటైన సమాధానం..

Vijayashanti: విజయశాంతి.. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెట్టింది పేరు.

Vijayashanti: మహేశ్ బాబును గారు అనడం ఎందుకు అన్న నెటిజన్.. విజయశాంతి దీటైన సమాధానం..
X

Vijayashanti: విజయశాంతి.. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెట్టింది పేరు. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత.. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాలపైనే ద‌ృష్టిపెట్టారు విజయశాంతి. ఆమె నటించిన సినిమాలను ఇప్పటికీ చాలామంది ఇష్టపడతారు. అయితే ఆమె ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన వల్ల ఆమె మంచి హీరోయిన్ మాత్రమే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ అని కూడా అర్థమవుతుంది.

చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత.. విజయశాంతి మళ్లీ వెండితెరపై మెరిసిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించారు. సినిమాల్లో గ్యాప్ వచ్చినా కూడా ఆమె నటనలో ఠీవీ ఏ మాత్రం మారలేదు అని చాలామంది ప్రేక్షకుల్లో భావించారు. ఇందులో హీరోగా నటించిన మహేశ్ బాబుకు, విజయశాంతికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి.

ఇటీవల ఫారిన్ టూర్ పూర్తి చేసుకొని వచ్చిన మహేశ్ బాబుకు కరోనా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. మహేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. అప్పటినుండి తన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మహేశ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే విజయశాంతి కూడా పెట్టారు.

'గెట్ వెల్ సూన్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు' అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయశాంతి. దానికి ఒక నెటిజన్.. మహేశ్ బాబు చాలు గారు ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ కామెంట్‌కు ధీటైన రిప్లై ఇచ్చారు విజయశాంతి. 'నా గురువులు అటల్ గారు, అద్వానీ గారు మాకు అలా నేర్పించారు. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను వారికంటే చిన్నదాన్నే అయినా.. నన్ను విజయశాంతి గారు అనే పిలిచేవారు' అని రిప్లై ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.Next Story

RELATED STORIES