సినిమా

Pushpa Movie: 'పుష్ప'లోని ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్‌కు ఆ సినిమాయే ఇన్‌స్పిరేషన్..!

Pushpa Movie: మలయాళంలో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పిన రైటర్ జిస్ జాయ్.. పుష్ప గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Pushpa movie (tv5news.in)
X

Pushpa movie (tv5news.in)

Pushpa Movie: థియేటర్లలో 'పుష్ప' సందడి మొదలయ్యింది. ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు, రష్మిక ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ కూడా సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మొత్తానికి హిట్ టాక్, వన్ మ్యన్ షో లాంటి రివ్యూలతో పుష్ప మొదటిరోజు మంచి స్టార్ట్‌నే ఇచ్చింది. అయితే 'పుష్ప'లో అల్లు అర్జున్ గురించి ఎంత మాట్లాడుతున్నారో విలన్ భన్వర్ సింగ్ షెకావత్‌గా కనిపించిన ఫాహద్ ఫాజిల్ గురించి కూడా ప్రేక్షకులు అంతే మాట్లాడుకుంటున్నారు.

మలయాళ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి ఫాహద్ ఫాజిల్ అంటే ఎవరో తెలీకుండా ఉండదు. ఫాహద్ అంటే ఎవరో తెలిసిన వారు తన యాక్టింగ్‌ను అభిమానించకుండా ఉండరు. అలాంటి ఫాహద్ ఫాజిల్ టాలీవుడ్‌లోకి వస్తున్నాడంటే తన తెలుగు ఫ్యాన్స్ అందరూ చాలా హ్యపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా తెలుగులో తన మొదటి సినిమానే సుకుమార్ లాంటి డైరెక్టర్‌తో అనగానే ఇక తనలోని నటుడిని మరోసారి పూర్తిస్థాయిలో చూడవచ్చని అంచనాలను పెంచేసుకున్నారు.

ఏ సినిమాలో అయినా హీరో బలంగా కనిపించాలంటే.. ముందు విలన్‌గా నటించే యాక్టర్ తన విలనిజమంతో మెప్పించాలి. పుష్ప సినిమాలో కూడా అదే జరిగింది. తెలుగులోనే కాదు వివిధ భాషల ప్రేక్షకుల దగ్గర నుండి కూడా పుష్పకు మంచి రెస్పాన్సే లభిస్తోంది. అయితే మలయాళంలో అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెప్పిన రైటర్ జిస్ జాయ్.. పుష్ప గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఆర్య సినిమా సమయం నుండి అల్లు అర్జున్‌కు మలయాళంలో డబ్బింగ్ చెప్తుంది జిస్ జాయే. అయితే పుష్పలో ఫాహద్ ఫాజిల్ ఉండడం వల్ల ఈ సినిమా మలయాళ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జాయ్. ఇందులో ఫాహద్ క్యారెక్టర్‌ను చూస్తుంటే తాను ఇంతకు ముందు నటించిన 'కుంబళంగి నైట్స్' సినిమాలోని క్యారెక్టర్‌లాగా అనిపిస్తుందని అన్నారు. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ను ఎంతగా ఎంజాయ్ చేసారో.. పుష్పలో కూడా అంతే ఎంజాయ్ చేస్తారని జాయ్ తెలిపారు.Next Story

RELATED STORIES