మోదీని రిక్వెస్ట్ చేసిన ఈ మయూరి ఎవరు?

మోదీని రిక్వెస్ట్ చేసిన ఈ మయూరి ఎవరు?
Sudha Chandran : ఎయిర్‌‌పోర్టు అధికారుల ప‌నితీరును నిరసిస్తూ ఏకంగా ప్రధానికి ట్యాగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు సుధా చంద్రన్..

Sudha Chandran : ఎయిర్‌‌పోర్టు అధికారుల ప‌నితీరును నిరసిస్తూ ఏకంగా ప్రధానికి ట్యాగ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు సుధా చంద్రన్.. అమెది కృత్రిమ కాలు కావడంతో ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిన ప్రతిసారి చెకింగ్‌ కోసమని ఆ కృత్రిమ కాలును తీయాల్సి వస్తుందని ఆమె తన పోస్ట్‌‌లో వివరించారు. తన పరిస్థితిని అధికారులకు ఎన్నిసార్లు వివరించినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని సుధా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేసింది. దయజేసి సీనియర్‌ సిటిజన్లకి `సీనియర్‌ సిటిజన్` అని చెప్పే కార్డ్ ఇవ్వండి` అని అభ్యర్థించింది. ఈ క్రమంలో ఎవరీ సుధాచంద్రన్ అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

సుధా చంద్రన్ అంటే ఇప్పటితరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు.. ఆమె జీవితం ఆధారంగా ఏకంగా ఓ సినిమానే తెరకెక్కింది. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి కూడా..సెప్టెంబర్ 21 1964 న కేరళలోని కన్నూర్‌లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సుధా చంద్రన్. ముంబైలో చదువుకుంది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం ఉండడంతో భరతనాట్యం నేర్చుకుంది. అయితే 1981వ సంవత్సరంలో ముంబై నుండి తమిళనాడుకు వస్తున్న క్రమంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడింది. దీనితో ఆ ప్రమాదంలో ఆమె ఓ కాలును కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు జైపూర్‌‌లోని వైద్యులు 'జైపూర్ కాలు' ను కృత్రిమంగా అమర్చారు.

నాట్యం అంటే మాములు విషయం కాదు.. ఎంతో నిబద్దత ఉండాలి.. మళ్ళీ అందులోనూ ఓ కాలు లేకుండా అంటే అస్సలు నాట్యాన్ని ఊహించుకోలేము కూడా.. మనిషి సంకల్పం గట్టిది అయితే అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.. ఆ కృత్రిమ కాలితోనే ఎన్నో నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచింది. ఆమె ప్రదర్శనలకి ఎన్నో అవార్డులు దాసోహం అన్నాయి. ఇండియాలోనే కాదు ఐరోపా, కెనడా మరియు మధ్య తూర్పు దేశాలలో కూడా ఆమె అనేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సినిమా టెలివిజన్ రంగంలో ప్రవేశించారు.

ఆమె జీవిత కధ ఆధారంగా 1984 లో తెలుగులో మయూరి సినిమా తెరకెక్కింది. ఇందులో ఆమె స్వయంగా నటించడం విశేషం. ఆ తర్వాత హిందీలో, టెలివిజన్ రంగంలో కూడా రాణించారు.

Tags

Read MoreRead Less
Next Story