Jabardasth : జబర్దస్త్‌‌‌‌లో కనిపించే ఈ సొట్టబుగ్గల సుందరి ఎవరు ? బ్యాక్‌‌‌ గ్రౌండ్ ఏంటి?

Jabardasth : జబర్దస్త్‌‌‌‌లో కనిపించే ఈ సొట్టబుగ్గల సుందరి ఎవరు ? బ్యాక్‌‌‌ గ్రౌండ్ ఏంటి?
Jabardasth : జబర్దస్త్.. అంటే ఇప్పుడిదో బ్రాండ్. మాములు వాళ్ళని కూడా స్టార్‌‌‌లని చేసిన ప్లాట్ ఫామ్ ఇది.. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ దాదాపుగా జబర్దస్త్ బ్యాచ్ వాళ్లే..

Jabardasth : జబర్దస్త్.. అంటే ఇప్పుడిదో బ్రాండ్. మాములు వాళ్ళని కూడా స్టార్‌‌‌లని చేసిన ప్లాట్ ఫామ్ ఇది.. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ దాదాపుగా జబర్దస్త్ బ్యాచ్ వాళ్లే.. అయితే జబర్దస్త్ అంటే మొన్నటివరకు అంతా మగవాళ్ళే ఉండేవారు.. కానీ ఇప్పుడలా కాదు.. లేడిస్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. వరుసగా స్కిట్స్ చేస్తున్నారు. మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు.


సత్యశ్రీ నుంచి మొదలు.. రితూ వరకు అందరూ క్లిక్ అయినవారే.. ఇప్పుడా లిస్టులో చేరిపోయింది మరో అమ్మాయి.. ఆ అమ్మాయి ఎవరో కాదు.. షబీనా.. ఆమె అసలు పేరు షబీనా షేక్... కెవ్వు కార్తీక్ టీంలో ఎక్కువగా స్కిట్స్ చేస్తుంటుంది. పెర్ఫార్మన్స్ తోనే కాదు.. క్యూట్ స్మైల్ తో ఫిదా చేస్తోంది.. ఆమె స్మైల్ ఇస్తే సొట్ట పడే బుగ్గులకి వీపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకి ఫ్యాన్స్ కూడా సొట్టబుగ్గల సుందరి ఓ ట్యాగ్ కూడా ఇచ్చేశారు.


ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రామ్‌‌‌తో మొదటిసారి స్క్రీన్ పైన మెరిసింది ఈ జబర్దస్త్ బ్యూటీ... ఆ తర్వాత బుల్లితెర పై నాపేరు మీనాక్షి', 'అత్తారింటికి దారేది', 'కస్తూరి' సీరియల్స్ తో ఆకట్టుకుంది. తాజాగా 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఇవేవి ఆమెకి అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి.


కానీ జబర్దస్త్ షోతో ఆమె ఫేమ్, ఫేట్ ఒక్కసారిగా మారిపోయాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామకి మంచి ఫాలోయింగ్ ఉంది. అదిరిపోయే అందాలతో కుర్రాకరు మతి పోగొడుతోంది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా ఓపెన్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story