Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్ బాస్ కిరీటం ఆ అమ్మాయికేనా..?

Bigg Boss 5 Telugu: ఈసారి బిగ్ బాస్ కిరీటం ఆ అమ్మాయికేనా..?
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తయ్యాయి.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికి నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. కానీ ఏ ఒక్క సీజన్‌లో కూడా బిగ్ బాస్ టైటిల్ అమ్మాయికి రాలేదు. అమ్మాయిలు షోలో టాప్ 5 వరకు వచ్చినా కూడా ఎప్పుడూ వారికి టైటిల్ మాత్రం రాలేదు. రన్నర్‌గా నిలిచిన అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ విన్నర్ మాత్రం లేరు. ఈసారి కూడా అలాగే టాప్ 5 రేసులో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వారే సిరి, ప్రియాంక, కాజల్.

ఈ ముగ్గురు అమ్మాయిల్లో ప్రస్తుతం చూస్తుంటే సిరి కాస్త ముందంజలో ఉంది. ముందు షన్నూతో ఉన్న సాన్నిహిత్యం వల్ల సిరికి ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరిగినా కూడా ఇటీవల తాను టాస్క్‌లలో చురుగ్గా ఆడడం, గొడవలకు దూరంగా ఉండడం వల్ల ప్రేక్షకుల్లో తనపై మళ్లీ పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇటీవల జరిగిన ఫ్యామిలీ వీక్ కూడా సిరికి చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

కాజల్ విషయానికొస్తే.. తాను ముందు నుండి గేమ్‌ను స్ట్రాటజీతోనే ఆడుతూ వస్తుంది. ఒక్కోసారి తన గేమ్ ప్లాన్ ఫెయిల్ అయినా కూడా వెంటనే మరో ప్లాన్‌తో ముందుకు దూసుకొస్తుంది. కానీ కాజల్ వల్లే బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటివరకు చాలా గొడవలు జరిగాయని కొంతమంది భావించారు. కానీ కాజల్ మాత్రం ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్‌గా నెట్టుకొచ్చింది. అయితే తాజాగా కాజల్‌ను సన్నీ సేవ్ చేయడం వల్ల రవి ఎలిమినేట్ అయ్యాడు. దీని ఇంపాక్ట్ త్వరలోనే తనపై పడే అవకాశం కనిపిస్తోంది.

సిరి, కాజల్ కంటే ప్రియాంక ఆట చాలా భిన్నం. సీజన్ మొదలయినప్పటి నుండి ప్రియాంక సక్సెస్ అయిన టాస్క్ లేదు. అయినా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కాస్త పరవాలేవనిపించింది. అంతే కాక మానస్‌తో స్నేహం కూడా ప్రియాంకకు అంతగా కలిసి రాలేదు. ఇటీవల ప్రియాంక చీటికిమాటికి గొడవ పడడం. అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల ప్రియాంకకు ఉన్న సపోర్ట్ కొంచెంకొంచెంగా తగ్గిపోతూ వస్తోంది.

ఈ లెక్కన చూస్తూ ప్రియాంక, కాజల్, సిరి ముగ్గురు టాప్ 5 కు వెళ్లే కంటెస్టెంట్స్‌లో అర్హులే. కానీ కాజల్, ప్రియాంకకు పలు కారణాల వల్ల బయట నెగిటివిటీ ఎక్కువయిపోయింది. అందుకే ఇప్పుడు వీరిద్దరితో పోలిస్తే సిరికే టాప్ 5కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్లలో ఇప్పటివరకు ఏ అమ్మాయి విన్నర్ కాకపోయినా.. టాప్ 5 వరకు మాత్రం ప్రతీ సీజన్‌లో ఎవరో ఒకరు రాగలిగారు. ఒకవేళ ఈసారి కూడా అలాగే జరిగితే సిరినే టాప్ 5లో నిలబడే అవకాశాలు ఎక్కువ.

Tags

Read MoreRead Less
Next Story