Maa Elections 2021 : మా ఎన్నికల్లో వీళ్లంతా ఎందుకు ఓటేయలేదంటే..

Maa Elections 2021 : మా ఎన్నికల్లో వీళ్లంతా ఎందుకు ఓటేయలేదంటే..
Maa Elections 2021 : ఓటు చాలా పవిత్రమైనది. అలాంటి ఓటుహక్కును వినియోగించుకుందాం.

Maa Elections 2021 : ఓటు చాలా పవిత్రమైనది. అలాంటి ఓటుహక్కును వినియోగించుకుందాం. బాధ్యతను చాటుకుందాం. ఈ మాటలన్నీ ఎవరో చెబితే.. ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుగా అనిపిస్తోంది కదా. ఆ చెప్పింది మన హీరోలు, హీరోయిన్లే. కానీ అలా చెప్పినవాళ్లే ఇప్పుడు తమ సంఘానికి జరిగిన ఎన్నికల్లో ఓటేయడానికి మాత్రం రాలేదు.

మా.. ఎన్నికలు ఈసారి చాలా టఫ్ గా జరిగాయి. రెండు ప్యానళ్లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. అందుకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా గురిపెట్టాయి. చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి కూడా సభ్యులను రమ్మని, ఓటేయమని ఆహ్వానించాయి. దీంతో భారీ స్థాయిలో తారలంతా తరలివచ్చారు. మా చరిత్రలోనే ఎక్కువగా పోలింగ్ నమోదై రికార్డ్ సృష్టించింది. కానీ ఇంత హడావుడిలోనూ చాలామంది స్టార్లు ఓటేయడానికి రాలేదు.

ఓటయడానికి రాని హీరోల లిస్టు చూస్తే.. వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ, నాగచైతన్య, నితిన్, సుమంత్, నాగశౌర్య, సునీల్ ఉన్నారు. దీంతో వీళ్లను చూడడానికి దూరాభారాలు లెక్కేయకుండా పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు పడ్డ అభిమానులకు నిరాశ తప్పలేదు.

ఓటేయడానికి రాని హీరోయిన్లు ఎవరంటే.. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, అనుష్క ఉన్నారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఆమె వస్తుందని చెప్పలేం. సమంత విడాకుల వ్యవహారం వల్ల రాలేకపోయిందని టాక్. మరి తమన్నా, అనుష్క సంగతేంటి? కొంతమంది బిజీ షెడ్యూల్ వల్ల, మరికొందరు షూటింగుల్లో ఉండడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story