సంజయ్ లీలా బన్సాలీ నన్ను ఎందుకు రిటైర్ అవ్వమన్నారంటే.. : అమీషా పటేల్

సంజయ్ లీలా బన్సాలీ నన్ను ఎందుకు రిటైర్ అవ్వమన్నారంటే.. : అమీషా పటేల్
తనను రిటైల్ అవ్వాలని బన్సాలీ చెప్పిన మాటలకు అర్థం చెప్పిన అమీషా పటేల్

ప్రముఖ నటి అమీషా పటేల్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం 'గదర్ 2' బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతోంది. ఆమె 22 సంవత్సరాల తర్వాత తన ప్రియమైన పాత్ర సకీనా పాత్రను మళ్లీ పోషించింది. దీంతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయగలిగింది. సన్నీ డియోల్‌తో ఆమె కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన హై పాయింట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. అమీషా పటేల్ కు 2001లో 'గదర్' మొదటి భాగం విడుదలైనపుడు ఎంత పేరు, విజయం దక్కాయో.. దానికి సమానమైన స్థాయిలో ఇప్పుడు కూడా అదే తరహా విజయాన్ని అందుకుంటోంది. కాదా ఇది ఆమె రెండవ హిందీ చిత్రం మాత్రమే. ఇటీవల, అమీషా.. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' విడుదల తర్వాత జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించింది. ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమా చూసి రిటైర్ అవ్వాలని తనను కోరినట్లు తెలిపింది. అసలు ఆయన ఎందుకు అలా అన్నాడో కూడా స్పష్టం చేసింది.

'కహో నా ప్యార్ హై', 'గదర్' విడుదల తర్వాత తన జీవితం ఎలా మారిందో అమీషా పటేల్ చెప్పుకొచ్చింది. 'దేవదాస్', 'హమ్ దిల్ దే చుకే సనమ్' వంటి ప్రముఖ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ 2001లో ఒరిజినల్ 'గదర్‌;ని చూసి రిటైర్ అవ్వమని అడిగినప్పటి ఒక సంఘటనను ఆమె వివరించింది. “గదర్ చూసిన తర్వాత, సంజయ్ లీలా బన్సాలీ నాకు అందమైన అభినందన లేఖ రాశారు. నేను అతనితో సమావేశం అయినప్పుడు, అతను 'అమీషా, నువ్వు ఇప్పుడు రిటైర్ అవ్వాలి' అన్నాడు. నేను 'ఎందుకు?' నాకు అర్థం కాలేదు” అని చెప్పింది.

అయితే దర్శకుడు ఎందుకలా చెప్పిన విషయాలను కూడా అమీషా బయటపెట్టింది. “ఎందుకంటే చాలా మంది తమ కెరీర్‌లో సాధించని రెండు చిత్రాలను మీరు ఇప్పటికే సాధించారు. జీవితంలో ఒక్కసారైనా మొఘల్-ఏ-ఆజం, మదర్ ఇండియా, పాకీజా, షోలే లాంటివి తయారవుతాయి. మీరు మీ రెండవ చిత్రంలో కూడా చేశారు, కాబట్టి తర్వాత ఏమిటి?' నా చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు, ఎందుకంటే నేను సినిమా ప్రపంచానికి చాలా కొత్తదాన్ని”అని ఆమె చెప్పింది. 'హుమ్రాజ్', 'భూల్ భులయ్యా', 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' వంటి ఆమె చిత్రాలన్నీ విజయవంతమయ్యాయో లేదా అన్నది పక్కన పెడితే.. వాటిని 'గదర్‌'తో పోల్చబడినప్పుడు ఆమె దాన్ని గ్రహించినట్టు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story