Rajamouli: రాజమౌళికి ఆపేరెలా వచ్చింది.. 'జక్కన్న' అని మొదట పిలిచిందెవరు

Rajamouli: రాజమౌళికి ఆపేరెలా వచ్చింది.. జక్కన్న అని మొదట పిలిచిందెవరు
ఓ షాట్‌ని ఎన్ని రకాలుగా తీయొచ్చో అన్ని రకాలుగా తీస్తారు. చిత్రీకరణ త్వరగా అయిపోతుందని అనుకున్నా. కానీ

Rajamouli: అన్నీ కుదిరితేనే ఆ పాత్ర తెరపైకి.. అందుకు సంవత్సరాలు గడిచినా అదే దీక్ష, అదే పట్టుదల, అంతే ఉత్సాహం. ఆయనతో పాటు ఆ చిత్రంలో నటించే నటీనటులకు కూడా. అందుకేనేమో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలిగారు దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమాల్లోని నటీ నటులు టేకుల మీద టేకులు తీసుకున్నా యాక్షన్‌లో ఫర్‌ఫెక్షన్ కనిపించాలి. అంతవరకు ఆగేది లేదంటూ అర్థరాత్రి అయినా షూటింగ్‌కి ప్యాకప్ చెప్పరు.

ఆ విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న నటుడు రాజీవ్ కనకాల. రాజమౌళి డైరెక్షన్‌లో అనేక చిత్రాల్లో నటించిన రాజీవ్.. ఓ చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ షాట్‌ని ఎన్ని రకాలుగా తీయొచ్చో అన్ని రకాలుగా తీస్తారు. చిత్రీకరణ త్వరగా అయిపోతుందని అనుకున్నా. కానీ ఆ సన్నివేశం అర్దరాత్రి 12.30 గంటలు అయినా కాలేదు. దాంతో వామ్మో పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కన్నలా అని అన్నాను. అదే ఆయన పేరుగా మారిపోయింది అని చెప్పుకొచ్చారు.

సొంత పేరు కన్నా ఎక్కువ పాపులర్ అయింది. కాగా, రాజీవ్, రాజమౌళి ఇద్దరూ స్నేహితులు. శాంతి నివాసం సీరియల్‌తో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సై, విక్రమార్కుడు, యమదొంగ తదితర చిత్రాల్లో రాజీవ్ కనకాల మంచి పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోనూ రాజీవ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story