సినిమా

Chiranjeevi- Nadhiya : చిరంజీవి ఛాన్స్ ఇచ్చినా.. మిస్ చేసుకున్న నదియా..!

Chiranjeevi- Nadhiya : టాలీవుడ్‌‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌లలో నదియా ఒకరు.. అత్త, అమ్మ పాత్రలలో ఆమె ఆదరగోడుతున్నారు.

Chiranjeevi- Nadhiya : చిరంజీవి ఛాన్స్ ఇచ్చినా.. మిస్ చేసుకున్న నదియా..!
X

Chiranjeevi- Nadhiya : టాలీవుడ్‌‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌లలో నదియా ఒకరు.. అత్త, అమ్మ పాత్రలలో ఆమె ఆదరగోడుతున్నారు. పెళ్లి తర్వాత మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన నదియా.. అత్తారింటికి దారేది సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెలక్టివ్‌‌గా పాత్రలను ఎంచుకుంటూ ముందుకువెళ్తున్నారు. మొదటిసారిగా 1984లో మలయాళ సినిమాలో మోహన్‌‌లాల్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. అప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి సరసన హీరోయిన్‌‌గా నటించే అవకాశం నదియాకి ఓ సారి వచ్చింది.

కె. మురళీమోహన రావు దర్శకత్వంలో 1990లో చిరంజీవి హీరోగా కొదమసింహం అనే సినిమా తెరకెక్కింది. కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉండగా చిరంజీవితో కౌబాయ్ సినిమా తీయాలనే ఆలోచన నిర్మాత కైకాల నాగేశ్వరరావుకు వచ్చింది. అందుకు చిరంజీవి కూడా అంగీకరించారు. అలా దాదాపుగా నాలుగు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్ లను తీసుకున్నారు. రాధ, వాణీ విశ్వనాధ్, నదియా.. ఇందులో వాణీ విశ్వనాధ్ గెస్ట్ రోల్ చేసింది. అయితే మెయిన్ హీరోయిన్‌‌‌గా నదియానే అనుకున్నారు కానీ ఆమెకి అప్పటికే పెళ్లి అయింది.

అయినప్పటికీ నిర్మాత నాగేశ్వరరావు ఆమెను ఈ సినిమా చేయమని ఒప్పించారు. కానీ చిరంజీవి డేట్లకి ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు.. ఆమె స్థానంలో హిందీ నటి సోనంను తీసుకున్నారు. రాధను మెయిన్ హీరోయిన్ ని చేశారు. ఆగస్టు 9, 1990లో విడుదలైన కొదమసింహం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. 20 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఆయన లుక్, యాక్టింగ్, మేనరిజమ్, ఫైట్స్, సిగార్ కాల్చే స్టైల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Next Story

RELATED STORIES