Maa : సురేష్‌ కొండేటిపై చర్యలు తీసుకోవాలంటూ 'మా'లో ఫిర్యాదు చేసిన మహిళా సంఘాలు

Maa : సురేష్‌ కొండేటిపై చర్యలు తీసుకోవాలంటూ మాలో ఫిర్యాదు చేసిన మహిళా సంఘాలు
Maa : మూవీ ఆర్టిస్ట్‌‌ అసోసియేషన్‌ సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Maa : మూవీ ఆర్టిస్ట్‌‌ అసోసియేషన్‌ సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ మహిళా సంఘాలు 'మా' మీటింగ్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగడంతో టెన్షన్‌ వాతావారణం నెలకొంది. DJ టిల్లు సినిమా ప్రమోషన్‌ ఈవెంట్‌లో సురేష్ కొండెటి వెకిలి ప్రశ్నలను నిరసిస్తూ వారంతా ఆందోళనకు దిగారు.

DJ టిల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్‌ పుట్టుమచ్చలు లెక్కపెట్టావా అంటూ..అందులో హీరోగా చేసిన సిద్ధూను ప్రశ్నించాడు సురేష్‌ కొండేటి. ఈ ప్రశ్నకు షాకైన సిద్దూ.. వదిలెయ్యండి అంటూ అక్కడితో దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశాడు. ఐతే.. ఈ పుట్టుమచ్చల ప్రశ్న వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ చిన్మయి సహా మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు దీన్ని ఖండించారు. ఈ నేపథ్యంలోనే సురేష్‌ కొండేటిపై చర్యలు తీసుకోవాలంటూ.. మహిళా సంఘాలు ఇటీవలే 'మా'కి ఫిర్యాదు చేసాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారంటూ ఆగ్రహంతో మహిళా సంఘాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సమావేశాన్ని అడ్డుకున్నాయి. సురేష్ కొండేటి వెకిలి ప్రశ్నలు మహిళల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.

ఈ వివాదంపై స్పందించారు మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కరాటే కల్యాణి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలపట్ల తానూ బాధపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. కమిటీ సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా ప్రెసిడెంట్ విష్ణు హామీ ఇచ్చారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story