Tollywood: ప్రతిభ ఉన్న డ్యాన్సర్లంతా ఆడిషన్స్ ఇవ్వండి: యానీ మాస్టర్

Tollywood: ప్రతిభ ఉన్న డ్యాన్సర్లంతా ఆడిషన్స్ ఇవ్వండి: యానీ మాస్టర్
అమ్మాయిలు ధైర్యంగా వచ్చి ఆడిషన్స్ ఇవ్వాలన్నారు

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ డాన్సర్ల కొరత ఉందని అన్నారు యానీ మాస్టర్. ఇందుకుగాను ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించిందన్నారు. ప్రతిభ ఉన్న వాళ్లంతా ఆడిషన్స్ ఇవ్వాలని కోరారు. ఫిల్మ్ చాంబర్‌లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు. 33 ఏళ్లుగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని... ఇప్పుడు డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్ షిప్ ఇవ్వాలని యూనియన్ నిర్ణయించుకుందని అన్నారు.

‘నేను ఇక్కడున్న ఎంతో మంది దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. ఈ నెల 20 నుంచి ఇక్కడ ఆడిషన్స్ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి మెంబర్లుగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన మాస్టర్లు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్‌గా రావొచ్చు. ఏదీ కూడా సులభంగా మన దగ్గరకు రాదు. మాకు లేడీ డ్యాన్సర్లు, లేడీ కొరియోగ్రాఫర్లు కావాలి. జూలై 20 21 22న ఫిలిం చాంబర్ వద్దకు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి. ఆ తరువాత మీరే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, యానీ మాస్టర్లు కావచ్చు’ అని యానీ మాస్టర్ అన్నారు.

డాన్యర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ . చంద్రశేఖర్ మాట్లాడారు. టాలెంట్ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు మా వద్ద 130 మంది మాస్టర్లు, 500 మంది డ్యాన్సర్లున్నారని అన్నారు. 200 మంది మెంబర్ షిప్ కానివాళ్లు ఉన్నారని వారికి మెంబర్ షిప్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మూడ్రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహిస్తున్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story