సినిమా

Yash Remuneration: కేజీఎఫ్1 సూపర్ హిట్.. అందుకే కేజీఎఫ్ 2 కోసం యశ్‌కు డబుల్ రెమ్యునరేషన్..

Yash Remuneration: కేజీఎఫ్1 సినిమాలో హీరోగా నటించిన యశ్‌కు కూడా ‘కేజీఎఫ్’ పెద్ద టర్నింగ్ పాయింట్.

Yash (tv5news.in)
X

Yash (tv5news.in)

Yash Remuneration: ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీని మూవీ లవర్స్ పెద్దగా పట్టించుకునేవారు కాదు. శాండిల్‌వుడ్‌కు కేవలం లోకల్‌గా మాత్రమే మార్కెట్ ఉండేది. కానీ ఆ హద్దులన్నీ దాటుకుంటూ వంద కోట్ల బడ్జెట్‌తో ఓ కన్నడ దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించాడు. అంతే కాకుండా దానిని పాన్ ఇండియాగా విడుదల చేయాలనుకున్నాడు. ఇది చూసిన శాండిల్‌వుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ ఆ దర్శకుడు అనుకున్నది చేసి చూపించాడు. అతడే ప్రశాంత్ నీల్. అతడు తెరకెక్కించిన సెన్సేషనే 'కేజీఎఫ్'.

తెలుగు సినిమా కనీసం రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయడం కష్టం అనుకుంటున్న సమయంలో 'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్‌నే మార్చేశాడు రాజమౌళి. అంతే కాకుండా కథ పెద్దగా ఉందని ఒకే సినిమాకు రెండు పార్ట్స్ తీశాడు. ఈ ఫార్ములా ఆ తరువాత చాలామంది దర్శకులు ఫాలో అయ్యారు. అందులో ఒకడు శాండిల్‌వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఒక కథ.. రెండు పార్ట్స్.. మార్కెట్‌ను మించిన బడ్జెట్.. ఈ ఫార్ములాతో కన్నడ పరిశ్రమను దేశవ్యాప్తంగా పరిచయం చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్‌కు కూడా 'కేజీఎఫ్' పెద్ద టర్నింగ్ పాయింట్. కేజీఎఫ్ ఛాప్టర్ 1 కోసం రూ.15 కోట్లు రెమ్యునరేషన్‌‌గా తీసుకున్న ఈ హీరో.. ఆ సినిమా సక్సెస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2కు రెమ్యునరేషన్‌ను ఏకంగా డబుల్ చేసేశాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న కేజీఎఫ్ ఛాప్టర్ 2కు యశ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఏకంగా రూ.30 కోట్లు అని టాక్.

Next Story

RELATED STORIES