ధోనీ అంటే ఎంతిష్టం అంటే..

ధోనీ అంటే ఎంతిష్టం అంటే..
ఎంఎస్ ధోని సిఎస్‌కే కలర్ తన ఇంటికి వేయించుకుని దానికి "హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్" అని పేరు పెట్టిన 'సూపర్ ఫ్యాన్'

తొలిసారిగా ఎంఎస్ ధోని సారధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మొదటిసారి ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. అక్టోబర్ 25, ఆదివారం, ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించడంతో సిఎస్‌కె అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుండి తప్పుకుంది. ఏదేమైనా, రెండుసార్లు ఐపిఎల్ ఛాంపియన్లు అభిమానుల హృదయాల్లో బలమైన చోటును సంపాదించుకున్నారు. జట్టు నాకౌట్ అయిన తర్వాత కూడా వారి ప్రతిచర్యలో ఇది కనిపిస్తుంది. ఎంఎస్ ధోని సిఎస్‌కే కలర్-పసుపు రంగుని తన ఇంటికి వేయించుకుని దానికి "హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్" అని పేరు పెట్టిన 'సూపర్ ఫ్యాన్' దీనికి ఉదాహరణగా నిలుస్తారు.

తమిళనాడులోని కడలూరులో నివసిస్తున్న గోపికృష్ణన్, సిఎస్‌కె పసుపు రంగులో తన ఇంటికి పెయింటింగ్ సిఎస్‌కే కలర్స్ వేయించుకునేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేయడమే కాకుండా, ముందు గోడలపై పెయింట్ చేసిన ధోని చిత్రాలను పెట్టుకున్నారు. అతని ఇంటి సైడ్‌వాల్‌లో సిఎస్‌కె లోగోతో పాటు "విజిల్ పోడు" అనే ట్యాగ్ లైన్ ఉంది. అభిమాని ప్రేమకు స్పందించిన సిఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని అతడికి ప్రత్యేక సందేశం ఇచ్చారు. సీఎస్‌కే పట్ల అతడికి ఉన్న అభిమానానికి కుటుంబం కూడా మద్దతు తెలపడం హర్షనీయం. మీ అభిమానానికి కృతజ్ఞతలు అని తెలిపారు.

గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్న గోపికృష్ణన్, నగరంలో జరిగే ప్రతి సిఎస్‌కె మ్యాచ్‌కు హాజరవుతాడు. కాని కరోనా కారణంగా ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేకపోయాడు."ధోని ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయినందుకు నిరాశ చెందాను, ధోని బాగా ఆడలేదని ఎంతో మంది విమర్శిస్తున్నారు. నేను అతనిని ప్రేరేపించాలనుకుంటున్నాను. ఆటలో గెలుపు ఓటములనేది సహజం.. ఓడిపోయినంత మాత్రాన అతడిపై ఉన్న అభిమానం చెరిగిపోదు. మేము ఎల్లప్పుడూ అతనికి మద్దతు ఇస్తాము" అని గోపికృష్ణన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story