విరుష్క దంపతుల కూతురి పేరు..

విరుష్క దంపతుల కూతురి పేరు..
ఈ రోజు తమ చిన్నారికి పేరు పెట్టామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క పాపని ఎత్తుకున్న ఫోటోని పోస్ట్ చేసింది

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాపాయి జన్మించింది. అయితే పాపాయి ఫోటోని కానీ, పేరుని కానీ ఇంతవరకు అభిమానులకు వెల్లడించలేదు. ఈ రోజు తమ చిన్నారికి పేరు పెట్టామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క పాపని ఎత్తుకున్న ఫోటోని పోస్ట్ చేసింది. తమ చిన్నారికి 'వామిక' అని పేరు పెట్టినట్లు తెలిపింది. పాపను చూసిన మరుక్షణం.. తనకు కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు అని అనుష్క్ పోస్ట్‌లో పేర్కొంది.

అనుష్క, కోహ్లీ ఇద్దరూ మొదట ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన సెట్‌లో కలుసుకున్నారు. 11 డిసెంబర్, 2017 న ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2021 జనవరి 11న బిడ్డకు జన్మనిచ్చింది అనుష్క.

Tags

Read MoreRead Less
Next Story